బాధితులను పరామర్శించిన ఆలూరు ఎమ్మెల్యే | - | Sakshi
Sakshi News home page

బాధితులను పరామర్శించిన ఆలూరు ఎమ్మెల్యే

Mar 9 2026 7:35 AM | Updated on Mar 9 2026 7:35 AM

హేమంత్‌ మృతదేహాన్ని సమ్మతగేరి గ్రామానికి తీసుకొచ్చారు. చదువులో బాగా రాణిస్తూ సౌమ్యంగా ఉండి ఇప్పుడిప్పుడే చేతికొస్తున్న హేమంత్‌ మృతి వార్తతో గ్రామం శోకసంద్రంలో మునిగింది. ఆలూరు ఎమ్మెల్యే బుసినె విరూపాక్షి, వైఎస్సార్‌సీపీ మహిళా రాష్ట్ర ప్రదాన కార్యదర్శి శశికళ కృష్ణమోహన్‌, పార్టీ నాయకులు, కార్యకర్తలు సమ్మతగేరికి వెళ్లారు. తల్లిదండ్రులు అడ్వకేట్‌ లక్ష్మికాంత్‌, సరిత, కుటుంబ సభ్యులను పరామర్శించి ౖధైర్యం చెప్పారు. హేమంత్‌ మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వారివెంట మండల కన్వీనర్‌ షఫివుల్లా, ఎస్కే గిరి, వెంకటేష్‌ తదితరులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement