మహిళా హామీలు గాలికొదిలేశారు | - | Sakshi
Sakshi News home page

మహిళా హామీలు గాలికొదిలేశారు

Mar 9 2026 7:35 AM | Updated on Mar 9 2026 7:35 AM

చంద్రబాబు ప్రభుత్వం మహిళలకు

మొండిచేయి

రెండేళ్లు గడుస్తున్నా ఆడబిడ్డ నిధి లేదు

వైఎస్సార్‌సీపీ మహిళా నాయకురాళ్లు

కర్నూలు (టౌన్‌): ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు మహిళలకు ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తరువాత గాలికి వదిలేశారని వైఎస్సార్‌సీపీ మహిళా నాయకురాళ్లు విమర్శించారు. ఆదివారం స్థానిక ఎస్వీ కాంప్లెక్స్‌లోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని నంద్యాల జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు కాటసాని రాంభూపాల్‌ రెడ్డి సతీమణి కాటసాని ఉమా మహేశ్వరమ్మ, వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్‌ అధ్యక్షురాలు ఎస్వీ విజయ మనోహరి తదితరులు ఘనంగా నిర్వహించారు. కేక్‌ కట్‌ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మహిళలకు పెద్ద పీట వేసిందన్నారు. జగనన్న మహిళలకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసి వారికి అండగా నిలిచారన్నారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే జగన్‌ ప్రభుత్వం కన్నా రెండింతలు సంక్షేమ పథకాలు ఇస్తామని ప్రతి సమావేశంలో చెప్పి ఇప్పుడు మొహం చాటేశారన్నారు. ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్ల నిండిన మహిళలకు ప్రతి నెల రూ.1,500 ఇస్తామని చెప్పి రెండేళ్లు పూర్తయిందన్నారు. కనీసం బడ్జెట్‌లో ఆ ఊసే లేదన్నారు. ఉచిత గ్యాస్‌ సిలిండర్లు అరకొరగా ఇస్తున్నారని, బస్సుల్లేని ఉచిత బస్సు పథకంతో మహిళలు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పిన చంద్రబాబు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్‌ రెడ్డి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు సిద్దారెడ్డి రేణుకా, జిల్లా మాజీ అధ్యక్షురాలు సిట్రా సత్యనారాయణమ్మ, మహిళా కార్పొరేటర్లు మునెమ్మ, పల్లవి, అరుణ, ఆర్షియా ఫర్హీన్‌, చిట్టెమ్మ, మహిళా విభాగం నగర అధ్యక్షురాలు మంగమ్మ, పార్టీ విభాగం నాయకురాళ్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement