జనగణనకు సన్నద్ధం
ఏప్రిల్ నుంచి ఇంటింటికీ వెళ్లనున్న అధికారులు
కులగణన కూడా చేసే అవకాశం
చివరగా 2011లో జనాభా లెక్కల సేకరణ
జిల్లా ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్‌గా కలెక్టర్
నెలాఖరులోపు నూతన మండలాల సరిహద్దుల గుర్తింపు
కర్నూలు(సెంట్రల్): పల్లెల్లో, పట్టణాల్లో జనాభా ఎంత ఉందో తెలుసుకునేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. జిల్లా, మండల వారీగా జనాభా లెక్కలు తీయనున్నారు. దేశవ్యాప్తంగా 2021లో జనగణన నిర్వహించాల్సి ఉంది. అయితే అప్పట్లో కరోనా కారణంగా తాత్కాలికంగా వాయిదా వేశారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జనాభా లెక్కల కోసం ఏప్రిల్ నుంచి అధికారులు ఇంటింటికీ వెళ్లనున్నారు. ఇందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. దేశంలో 1872 నుంచి జనాభా లెక్కల సేకరణ జరుగుతోంది. 1881 నుంచి ప్రతి పదేళ్లకొకసారి జనగణన చేస్తున్నారు. దేశంలో 2011లో జనాభా లెక్కలు తీయాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా వాయిదా వేశారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం జనాభా లెక్కల సేకరణపై డిమాండ్ ఉంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం 2026 జనవరి నుంచి 2027 ఏప్రిల్ వరకు జనాభా లెక్కల సేకరణకు శ్రీకారం చుట్టింది.
నెలాఖరులోపు భౌగోళిక పరిస్థితులపై అధ్యయనం పూర్తి
ఇటీవల సెన్సార్ కమిషనర్ జిల్లాల్లో జనాభా సేకరణకు సంబంధించి ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్‌గా కలెక్టర్, అడిషినల్ ప్రిన్సిపల్ ఆఫీసర్‌గా జాయింట్ కలెక్టర్, జిల్లా సెన్సస్ ఆఫీసర్‌గా డీఆర్వో, అడిషినల్ సెన్సస్ ఆఫీసర్లుగా సీపీఓ, డీఈఓ, డీఎఫ్‌ఓ, డీపీఓ, సర్వే ఏడీలను నియమించింది. వీరంతా జిల్లాలో జనాభా లెక్కల సేకరణ కోసం చర్యలు తీసుకుంటారు. ఈ నెలాఖరులోపు జిల్లా సరిహద్దులు, మండలాలు, గ్రామాల సరిహద్దుల భౌగోళిక అంశాలపై నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. జిల్లాలో కొత్తగా ఏర్పాటైన మండలాల సరిహద్దుల వివరాలను నెలాఖ రులోపు క్రమబద్ధీకరించాల్సి ఉంది. అలాగే జనాభా సేకరణ కోసం ఎన్యూమరేటర్ల నియామకం, వారికి శిక్షణ, జనాభా సేకరణలో వినియోగించే ఫారాలు తదితర వివరాలను సిద్ధం చేసుకోవాల్సి ఉంది. ఏప్రిల్ 1 నుంచి ఇంటింటా సర్వేకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. సర్వేను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా సేకరిస్తారా అన్నది స్పష్టం కాలేదు. గతంలో ఉపాధ్యాయులను ఎన్యుమరేటర్లుగా నియమించే వారు. వారి స్థానంలో సచివాలయ ఉద్యోగులను నియమించే అవకాశం ఉంది.
నిరుద్యోగులపై
కేసు నమోదు
ఆళ్లగడ్డ: హెల్త్ అండ్ వెల్త్ స్కీం పేరిట నిరుద్యోగులను ముంచిన ఘటన ఇంకా రగులుతూనే ఉంది. తాము కట్టిన డబ్బులు ఇవ్వాలంటూ బాధితులు రెండు రోజుల క్రితం దొర్నిపాడులోని నిందితుడు వీరారెడ్డి ఇంటిని ముట్టడి చేశారు. వందలాది మంది బాధితులు గుమికూడడంతో విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా నిందుతుడి ఇంటితో పాటు పోలీస్ వాహనంపై బాధితులు రాళ్లతో దాడి చేశారనే ఘటనపై 20 మందికి పైగా మంగళవారం రాత్రి దొర్నిపాడు పోలీసులు కేసునమోదు చేసినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఖాదర్‌బాషా, తేజకుమార్, నాగయ్య, తేజ, రామచంద్రుడు, రవికుమార్, క్రాంతి, హుసేన్‌వలి, హుసేన్‌బాషా, గఫార్, రజాక్, రజియా, నూర్‌బాషా, అశోక్, ఫరూక్, గణేష్, శివ, లక్ష్మినారాయణ, యాగ్నేష్‌లతో పాటు మరో కొంతమందిపై కేసునమోదు చేసినట్లు తెలిసింది. మూడు రోజులు క్రితం జరిగిన ఘటనపై రహస్యంగా కేసునమోదు చేయడంపై పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ వివాదం గత కొంతకాలంగా సద్దుమణిగినా ప్రస్తుతం మళ్లీ పురుడు పోసుకుంటుంది. వర్క్ ఫ్రం హోం ఉద్యోగం పేరిట వందలాది మంది నిరుద్యోగుల నుంచి రూ.కోట్లు వసూలు చేసిన సంగతి తెలిసిందే.
కుల గణనకు శ్రీకారం
దేశంలో చివరి సారిగా 1931లో కులగణన జరిగింది. అప్పటి నుంచి సాధారణ జనగణన తప్ప కులాల గణన చేపట్టడం లేదు. అయితే ఎస్సీ, ఎస్టీల జనాభా గణన మాత్రం క్రమం తప్పకుండా తీస్తున్నారు. ఓబీసీలు, ఇతర కులస్తుల వివ రాలు లేవు. ఈ నేపథ్యంలో దేశంలో బీసీ కులాల గణన కోసం దాదాపుగా 93 ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కుల గణనకు కూడా పచ్చజెండా ఊపింది.
2011 జనాభా లెక్కలు
మొత్తం జనాభా: 40,53,463
మహిళలు: 20,39,227
పురుషులు: 20,14,236
2011 లెక్కల ప్రకారం
జిల్లా అక్షరాస్యత శాతం: 67.35 శాతం
పురుషుల అక్షరాస్యత శాతం: 74.77 శాతం
సీ్త్ర అక్షరాస్యత శాతం: 59.96


