కన్నీటి పయనం!
గ్రామంలో వ్యవసాయ పనులు లేకపోవడం.. ప్రభుత్వం స్థానికంగా ఉపాధి పనులు కల్పించకపోవడంతో కూలీలు గుంటూరు, బెంగళూరుకు వలస పోతున్నారు. గత మంగళ, బుధవారాల్లో మండల పరిధిలోని పొదలకుంట గ్రామం నుంచి 100 కుటుంబాలు వలసబాట పట్టాయి. గ్రామంలో ఉపాధి పనులు కల్పించకపోవడంతోనే వలసపోతున్నట్లు గ్రామస్తులు కథలి సోమయ్య, తోవి విరుపాక్షి, కోసిగి ముత్తన్న, కోసిగి చంటి, ముద్దయ్య గారి మహాదేవి తదితరులు వాపోయారు. గ్రామంలో ఒక్కసారిగా వంద కుటంబాలు వలస పోవడంతో గ్రామం బోసిపోయింది. – కౌతాళం
లారీలో గుంటూరుకు వెళ్తున్న కూలీలు
100 కుటుంబాలు వలసబాట


