వేదభూమిలో భక్తిపారవశ్యం
మంత్రాలయం: వేదభూమి మంత్రాలయంలో ఆదివారం భక్తిభావం వెల్లివిరిసింది. ఇరు తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక ప్రాంతం నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. ఉదయాన్నే తుంగభద్ర నదిలో పుణ్యసాన్నాలు ఆచరించారు. అనంతరం గ్రామ దేవత మంచాలమ్మ సన్నిధిలో అభిషేకం చేశారు. కుంకుమ అర్చన అనంతరం నైవేద్యం సమర్పించారు. శ్రీరాఘవేంద్ర మూల బృందావనానికి సువర్ణ కవచంతో ఆలంకరణ చేయగా భక్తులు దర్శనం చేసుకున్నారు. బృందవానానికి నిత్య పూజలు చేశారు. శ్రీమఠంలోని మధ్వ కారిడార్, కల్పతరు క్యూలైన్ దగ్గర భక్తుల రద్దీ కొనసాగింది. భక్తుల రద్దీని ఉదయం శ్రీమఠం పీఠాధిపతి సుభుధేంద్ర తీర్థులు పరిశీలించారు. శ్రీమఠం ప్రాంగణంలో భక్తుల మధ్య చెక్క రథంపై అంగరంగ వైభవంగా ప్రహ్లాదరాయలు విహరించారు.


