స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ గెలుపే లక్ష్యం
● వైఎస్సార్‌సీపీలో చేరిన టీడీపీ నాయకులు
ఎమ్మిగనూరు టౌన్: స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా పని చేద్దామని పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త కడిమెట్ల రాజీవ్‌రెడ్డి పిలుపునిచ్చారు. మండల పరిధిలోని సిరాలదొడ్డి గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి నివాసంలో సోమవారం ఆ పార్టీ నుంచి వైఎస్‌ఆర్‌సీపీలో చేరారు. పార్టీలో చేరిన టీడీపీకి చెందిన చిన్న బడేసాబ్ కుమారులైన బజ్జి ఖాజ, కుమ్మరి లక్ష్మన్న, కుమ్మరి సోమేష్, బోయ రైతన్న, హరిజన బాబు, కుమ్మరి చెన్నప్ప, గొల్ల చిరంజీవి, పి.దస్తగిరి, మౌళాలి, అల్లిపీర, ఖాజ, గొల్ల మధులకు నియోజకవర్గ సమన్వయకర్తతో పాటు పార్టీ యూత్ నాయకుడు ఎర్రకోట పవన్‌కళ్యాణ్ రెడ్డిలు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు పాలనలో గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడిందన్నారు. సూపర్ సిక్స్ పథకాలంటూ ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి 18నెలలు గడుస్తున్నా అన్ని వర్గాల ప్రజలను మోసగించారన్నారు. త్వరలోనే ప్రజలు తిరగబడి తగిన బుద్ధి చెబుతారన్నారు. కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు రాళ్లదొడ్డి చాంద్‌బాషా, బాబులాల్ తదితరులు పాల్గొన్నారు.


