
అధికారులూ.. ‘చెత్త’గించరూ!
సూపర్ జీఎస్టీ.. సూపర్ సేవింగ్స్ అంటూ కూటమి నేతలు కర్నూలు సభలో ఊదరగొట్టారు. సభకు లక్షలాది జనాన్ని బస్సుల్లో తరలించి ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎంతో పాటు మంత్రులు, మూడు పార్టీల నాయకులు హడావుడి చేశారు. అయితే ప్రజలు సభలో ఏమి తెలుసుకున్నారో ఏమో కానీ.. సభాప్రాంగణం ప్రస్తుతం అంతా ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోయింది. ఎటు చూసినా వాటర్ బాటిళ్లు, నీళ్లు, మజ్జిగ ప్యాకెట్లు, భోజనం పార్సిల్ కవర్లు కనిపిస్తున్నాయి. పది రోజుల క్రితం పచ్చని పైర్లతో కళకళలాడుతున్న పొలాలు నేడు డంప్‌యార్డును తలపిస్తున్నాయి. స్వచ్ఛ భారత్.. స్వచ్ఛాంధ్ర.. స్వచ్ఛ దివాస్ అంటూ చెప్పే పాలకులు, అధికారులు ఈ ప్రాంతాన్ని మాత్రం విస్మరించారు. ప్లాస్టిక్ రహిత సమాజాన్ని స్థాపిద్దామంటూ ప్రతి నెలా మూడో శనివారం కార్యక్రమాలు చేపట్టే అధికారులు ఈ సభా ప్రాంగణం వైపు మాత్రం ఈ రోజు కన్నెతి చూడలేదు. వెంటనే వ్యర్థాలను తొలగించాలని ప్రజలు, పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు. – వడ్డె శ్రీనివాసులు,
సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలు

అధికారులూ.. ‘చెత్త’గించరూ!