
ముస్లింల సామూహిక వివాహాలు
ఆదోని సెంట్రల్: పట్టణంలో అబాబెల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సామూహిక వివాహాలను శనివారం ఘనంగా నిర్వహించారు. పట్టణ, గ్రామీణ ప్రాంతంలోని నిరుపేద ముస్లిం కుటుంబాలకు చెందిన ఏడు జంటలను గుర్చించి కేకేబీ ఫంక్షన్ హాలులో ముస్లిం మత పెద్దల సమక్షంలో వివాహాలను జరిపించారు. ఈ వివాహాలను జరిపించడానికి ముస్లిం సోదరులు చాలా మంది తమవంతుగా చేయుత నందించారని ఇస్లామిక్ ట్రస్ట్ సభ్యులు తెలిపారు. కొందరు వస్తు రూపంలోనూ మరి కొందరు భోజనాలు ఏర్పాట్లు వంటి అవసరమైన ప్రతి వస్తువులను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలకు ముస్లిం ఆచారం ప్రకారం వారి ఇంటికి అవసరమైన ప్రతి వస్తువులను దాతలు అందజేశారు.

ముస్లింల సామూహిక వివాహాలు