
గుర్తు తెలియని వ్యక్తి దుర్మరణం
కర్నూలు: నగర శివారు 44వ నంబర్ జాతీయ రహదారి తుంగభద్ర బ్రిడ్జి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందాడు. గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. మృతుడి వయస్సు సుమారు 35 సంవత్సరాలు ఉంటుంది. జంగిల్ పాచి కలర్ ఫుల్ షర్టు, పంచ ధరించాడు. 5.5 అడుగుల ఎత్తు ఉంటాడు. విషయం తెలిసిన వెంటనే కర్నూలు అర్బన్ తాలూకా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీ కేంద్రానికి తరలించారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 91211 01063 లేదా 91211 01064 నంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందించాలని పోలీసులు కోరారు.