
నేటి నుంచి బోధనేతర పనుల బహిష్కరణ
కర్నూలు సిటీ: ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్య ల పరిష్కారంలో కూటమి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖ రికి నిరసనగా ఈ నెల 7వ తేదీన ఫ్యాఫ్టో ఆధ్వర్యంలో విజయవాడలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా చేసిన తీర్మానం మేరకు.. శుక్రవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ స్కూళ్లలో బోధనేతర, విద్యాశక్తి కార్యక్రమాలను బహిష్కరిస్తున్నట్లు ఫ్యాఫ్టో నాయకులు ప్రకటించారు. ఈ మేరకు ఫ్యాఫ్టో సెక్రటరీ జనరల్ భాస్కర్ ఆధ్వర్యంలో గురువారం డీఆర్‌ఓ నారాయణమ్మ, డీఈఓ ఎస్.శ్యామూల్ పాల్‌కు వినతి పత్రాలు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. విద్యార్థుల హాజరు, మధ్యాహ్న భోజనం హాజరు చేపడ తామని, గూగుల్ షీట్ సమాచారం పంపడం, ఆన్‌లైన్ సమావేశాలు వంటి వాటిని బహిష్కరిస్తున్నట్లు వెల్లడించారు.ఫ్యాఫ్టో అనుబంధ సంఘాల నాయకులు నవీన్ పాటిల్, గోకారి, జనార్ధన్, మరియానందం, మధుసూదన్ రెడ్డి, హుసేన్, నందీశ్వరుడు, రోశన్న, తదితరులు పాల్గొన్నారు.
ఖతార్– దోహాలో
హోంకేర్ నర్సు ఉద్యోగాలు
కర్నూలు(అర్బన్): స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఓఎంసీఏపీ ద్వారా బీఎస్సీ నర్సింగ్/ జీఎన్‌ఎం నర్సింగ్ చదివి 21 –40 ఏళ్ల వయస్సు కలిగిన అభ్యర్థులకు కథార్ – దోహాలో హోంకేర్ నర్సుగా ఉద్యోగాలు కల్పించనున్నట్లు మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఈడీ ఎస్ సబీహా పర్వీన్ తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు htt ps://naipunyam.ap.gov.in/userregistration? page=programme-registration వెబ్‌లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆమె గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు. దరఖాస్తులకు సర్టిఫికెట్లను జతచేసి ఈ నెల 12లోగా కలెక్టరేట్‌లోని తమ కార్యాలయంలో అందించాలన్నారు. మరి న్ని వివరాలకు సెల్ 94408 22219, 98488 64449 నంబర్లను సంప్రదించాలన్నారు. 13వ తేదీన ఇంటర్వ్యూలు ఓఎంసీఏపీ ఆఫీసు, ప్రభు త్వ ఐటీఐ క్యాంపస్, రమేష్ హాస్పిటల్ రోడ్, విజయవాడలో ఉంటాయని వెల్లడించారు.
కోలుకోలేక వ్యక్తి మృతి
కర్నూలు: జోగుళాంబ గద్వాల జిల్లా రాజోలి గ్రామానికి చెందిన షేక్ మాబు బాషా (41) రోడ్డు ప్రమాదానికి గురై కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకోలేక గురువారం తెల్లవారుజామున మృతిచెందాడు. సమీప బంధువు వహీద్ బాషాతో కలిసి బుధవారం మధ్యాహ్నం ద్విచక్ర వాహనంపై కర్నూలుకు వస్తుండగా ఎదురూరు గ్రామ శివారులోని సూరత్ హైవే బ్రిడ్జి వద్ద టిప్పర్ ఢీకొట్టడంతో షేక్ మాబు బాషా తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కోలుకోలేక మృతిచెందాడు. ఈయన కూలీ పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. భార్య షేకున్‌తో పాటు ముగ్గురు కూతుర్లు సంతానం. వాహనం నడుపుతున్న వహీద్ బాషా స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. వహీద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కర్నూలు అర్బన్ తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.