
పాఠశాలకు వెళ్తుండగా ఘోరం
● స్కూటర్‌ను ఢీకొన్న లారీ
● తండ్రి, కుమారుడు మృతి
● బిల్లేకల్లు సమీపంలో దుర్ఘటన
ఆస్పరి: దసరా సెలవులు మగియడంతో కుమారుడిని పాఠశాలకు స్కూటర్‌పై తీసుకెళ్తుండగా గురువారం ఆస్పరి మండలం బిల్లేకల్లు గ్రామ సమీపంలో లారీ ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో తండ్రి, కుమారుడు మృతి చెందారు. కృష్ణగిరి మండలం పోతుగల్లు గ్రామానికి చెందిన మహేష్, రామేశ్వరమ్మ దంపతులకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్దకుమార్తె లావణ్య 10వ తరగతి పాసై ఇంటి దగ్గరే కుట్టు మిషన్ నేర్చుకుంటున్నారు. చిన్న కుమార్తె గౌతమి.. పోతుగల్లు గ్రామంలో 7వ తరగతి చదువుతున్నారు. కుమారుడు శ్రీనివాసులు 9వ తరగతి ఆలూరు మండలం అరికెర గురుకులంలో చదువుతున్నాడు. దసరా సెలవులు ముగియడంతో కుమారుడు శ్రీనివాసులును (14) పాఠశాలలో విడిచేందుకు తండ్రి మహేష్ (45) గురువారం ఉదయం స్కూటర్‌పై బయలు దేరాడు. అయితే దేవనకొండ దాటిన తరువాత బిల్లేకల్లు సమీపంలో ఆస్పరి నుంచి కర్నూలు వైపు వెళ్తున్న లారీ వేగంగా ఢీకొట్టడంతో విద్యార్థి శ్రీనివాసులు అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన తండ్రి మహేష్‌ను చికిత్స నిమిత్తం అంబులెన్స్‌లో కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ కొద్ది సేపటికే మృతి చెందినట్లు ఆస్పరి సీఐ గంగాధర్ తెలిపారు. కూలి పనులు చేసుకుంటూ ముగ్గరిని చదివిస్తున్నారు. ఒకే సారి తండ్రి, కుమారుడు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపించారు. పొతుగల్లు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
విద్యార్థి శ్రీనివాసులు, తండ్రి మహేష్ (ఫైల్)

పాఠశాలకు వెళ్తుండగా ఘోరం

పాఠశాలకు వెళ్తుండగా ఘోరం