
నేటికీ నిధులు కేటాయించకపోవడం దుర్మార్గం
కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర గడుస్తున్నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ తదితర కార్పొరేషన్లకు ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడం దుర్మార్గం. దరఖాస్తు చేసుకొని ఐదు నెలలు గడచిపోయినా, నేటి వరకు ఆయా దరఖాస్తులు ఏమయ్యాయో కూడా తెలియని పరిస్థితి. ఎవరిని అడిగినా తెలియదనే సమాధానమే వస్తోంది. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను వెంటనే విడుదల చేయాలి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే ఉద్యమాలను చేపడతాం.
– సి.మహేష్, డీహెచ్‌పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి