
టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరిక
ఎమ్మిగనూరుటౌన్: టీడీపీని వీడి గోనెగండ్ల మండల పరిధిలోని పిల్లిగుండ్ల గ్రామానికి చెందిన నాయకులు వైఎస్సార్‌సీపీలో చేరారు. ఎమ్మిగనూరు పట్టణంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో గరువారం ఈ కార్యక్రమం జరిగింది. మాజీ ఎంపీ, నియోజకవర్గ ఇన్‌చార్జ్ బుట్టారేణుక సమక్షంలో పిల్లిగుండ్ల గ్రామానికి చెందిన కందనూలు వెంకటేష్, కురువ రవికుమార్, వల్కూరు శివ,కొమ్మల శేఖర్, కురువ శ్రీనివాసులు, కురువ రాముడు, సుధాకర్, బాస్కర్, కురువ వెంకటేష్, సోమన్న, ప్రవీణ్, బోయ విష్ణుకుమార్, చిన్న దుబ్బన్నతో పాటు 50 కుటుంబాలు వైఎస్సార్‌సీపీలో చేరారు. మళ్లీ జగనన్న ప్రభుత్వం అధికారంలోకి తీసుకొచ్చేందుకు అందరూ ఐక్యతతో కృషి చేయాలని ఆమె ఈ సందర్భంగా సూచించారు. పార్టీ నేతలు బుట్టా శివనీలకంఠ, మురహరి రెడ్డి, గోనెగండ్ల, ఎమ్మిగనూరు మండలాల పార్టీ కన్వీనర్లు కేవీ కృష్ణారెడ్డి, బీఆర్ బసిరెడ్డి, నాయకులు నాగేష్ నాయుడు, పార్టీ బీసీ సెల్ నాయకుడు దొరబాబు నాయుడు, ఉరుకుందారెడ్డి, దేవేంద్ర, ఒంటెడుదిన్నె రాజారెడ్డి, కై రవాడి శ్రీను తదితరులు పాల్గొన్నారు.