
కొత్త జేసీగా నూరుల్లా ఖమర్
డాక్టర్ బి.నవ్య వేర్‌హౌస్ కార్పొరేషన్ వీసీ అండ్ ఎండీగా బదిలీ
కర్నూలు(సెంట్రల్): జిల్లా నూతన జాయింట్ కలెక్టర్‌గా నూరుల్లా ఖమర్ నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2020 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన నూరుల్లా ఖమర్ ప్రస్తుతం ఫైనాన్స్ విభాగానికి సంబంధించి ప్రభుత్వానికి డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తున్నారు. గతంలో ఆయన కర్నూలు జిల్లాలోనే ట్రైనీ కలెక్టర్‌గా పనిచేశారు. కాగా ఇక్కడ జేసీగా పనిచేస్తున్న డాక్టర్ బి.నవ్యను వేర్‌హౌస్ కార్పొరేషన్ వీసీ అండ్ ఎండీగా బదిలీ చేశారు. ఆమె దాదాపు 15 నెలలపాటు జేసీగా విధులు నిర్వహించారు. రెవెన్యూ అంశాలపై పట్టు సాధించిన ఆమె చాలా వరకు విజయం సాధించారు. ముఖ్యంగా రీసర్వే, భూసమస్యలపై నిక్కచ్చిగా వ్యవహరిస్తూ పలు సమస్యలను పరిష్కరించారు. ఇదిలాఉంటే ఆదోని సబ్ కలెక్టర్‌గా పనిచేస్తున్న ఎం.మౌర్య భరద్వాజ్‌ను సత్యసాయి జిల్లా జాయింట్ కలెక్టర్‌గా నియమించారు. అయితే ఆయన స్థానంలో ఎవరినీ నియమించలేదు.
సత్యసాయి జిల్లా జేసీగా ఆదోని
సబ్ కలెక్టర్ ఎం.మౌర్య భరద్వాజ్
గతంలో ట్రైనీ కలెక్టర్‌గా కర్నూలులో
పనిచేసిన నూరుల్లా ఖమర్