
మంచిది కాదు
మెడికల్ కళాశాలలను ప్రయివేట్ పరం చేయడం మంచిది కాదని ఎస్వీ మోహన్‌రెడ్డి అన్నారు. ఆదోని ప్రాంతంలో మెడికల్ కళాశాల పూర్తయితే ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆలూరు, పత్తికొండ ప్రాంతాలకు చెందిన ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఇప్పటికై నా మెడికల్ కళాశాలలను పూర్తి చేసి ప్రయివేట్ వ్యక్తులకు కాకుండా ప్రభుత్వమే నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాలనా కాలంలో రూ.3లక్షల కోట్లు అప్పు చేస్తే కూటమి ప్రభుత్వం ఒకటిన్నర సంవత్సరంలోపే రూ.2 లక్షల కోట్లు అప్పు చేసిందన్నారు. ఇంత అప్పు చేసినా మెడికల్ కళాశాలలను ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎందుకు నడపలేకపోతున్నారని ప్రశ్నించారు.