'లయ' తప్పని వైద్యం | - | Sakshi
Sakshi News home page

'లయ' తప్పని వైద్యం

Sep 18 2025 7:21 AM | Updated on Sep 18 2025 12:56 PM

 Doctors administering a tenectomy plaque injection to a patient who had suffered a heart attack at the casualty ward of the Kurnool Government General Hospital

కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని క్యాజువాలిటీలో గుండెపోటు వచ్చిన ఓ రోగికి టెనెక్టమి ప్లేజ్‌ ఇంజెక్షన్‌ ఇస్తున్న వైద్యులు

దివంగత నేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి గుండెశస్త్ర చికిత్సలను ఆరోగ్యశ్రీలోకి చేర్చి ఎంతో మందికి ప్రాణం పోశారు. ఆయన తనయుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి గుండెపోటుకు గురైన వారికి వెంటనే ఖరీదైన ఇంజెక్షన్లు ఇచ్చే వైద్యాన్ని తీసుకొచ్చారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయంలో ప్రారంభించిన స్టెమీ ప్రోగ్రామ్ ఇప్పటికీ కొనసాగుతూ అనేక మంది ప్రాణాలు నిలుపుతోంది. జిల్లాలోని కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో పాటు ఏరియా ఆసుపత్రులు, సీహెచ్ సీల్లోనూ ఈ ఖరీదైన ఇంజెక్షన్లు ఇస్తున్నారు.

కర్నూలు(హాస్పిటల్‌): ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా గుండెపోటుతో ఆకస్మిక మరణాలు అధికమయ్యాయి. ఒకప్పుడు వృద్ధుల్లో మాత్రమే కనిపించే ఈ గుండెపోటు మరణాలు ఇప్పుడు యువకుల్లోనూ అధికమయ్యాయి. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఎక్కువసేపు కూర్చుని పనిచేయడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని వైద్యులు చెబుతున్నారు. ఇలాంటి బాధితుల కోసం 2023 సెప్టెంబర్‌లో నేనున్నాంటూ అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సరికొత్త ప్రోగ్రామ్‌ను తెచ్చారు. కేవలం నగర కేంద్రాల్లోని ఆసుపత్రుల్లోనే గాకుండా ఏరియా ఆసుపత్రులు, సీహెచ్‌సీల్లో కూడా త్రాంబోలైసిస్‌ విధానంలో రూ.40వేల విలువ చేసే ఖరీదైన టెనిక్టమి ప్లేజ్‌ అనే ఇంజెక్షన్లు అందుబాటులో ఉండేటట్లు చేశారు. సీహెచ్‌సీలకు వచ్చిన రోగికి ముందుగా ఈసీజీ తీసి కర్నూలులోని టెలిమెడిసిన్‌ హబ్‌కు పంపిస్తారు. అక్కడి వైద్యుల సూచన మేరకు ఈ ఇంజెక్షన్‌ ఇస్తున్నారు. గుండెపోటు వచ్చిన వారిని మొదటి గంటలోపు సమయానికి తీసుకొస్తే వెంటనే ఈ ఖరీదైన ఇంజెక్షన్‌ ఇచ్చి బతికిస్తున్నారు. రోగులకు భారం గాకుండా ఆరోగ్యశ్రీ పథకంలోనే దీనిని చేర్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు జిల్లాలో వందలాది మంది ప్రాణాలు పోసింది ఈ ఇంజెక్షన్‌.

కూటమి ప్రభుత్వం గొప్పలు

స్టెమీ ప్రోగ్రామ్‌ను తామే ప్రవేశపెట్టామని, దానిని ఎన్‌టీఆర్‌ వైద్యసేవ పథకంలో చేర్చి రోగులకు ఉచితంగా ఇస్తున్నామని కూటమి ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోంది. ఈ ప్రోగ్రామ్‌పై ఆ పార్టీ నాయకులతో పాటు పచ్చమీడియా సైతం ప్రచారం చేసుకుంటూ వస్తోంది. వాస్తవంగా ఈ ప్రోగ్రామ్‌ 2023లో అప్పటి వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అప్పట్లోనే దీనిని ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చి గుండెరోగుల ప్రాణాలు పోకుండా కాపాడుతోంది.

మూడేళ్లలో టెనిక్టమి ప్లేజ్‌ ఇంజెక్షన్‌ వివరాలు

ఆసుపత్రి, 2023, 2024, 2025

ఎమ్మిగనూరు ఏరియా ఆసుపత్రి, 1, 9, 5

ఆలూరు సీహెచ్‌సీ, 1, 10, 8

పత్తికొండ సీహెచ్‌సీ, 3, 20, 26

ఓర్వకల్‌ సీహెచ్‌సీ, 1, 7, 6

కోడుమూరు సీహెచ్‌సీ, 3, 14, 11

వెల్దుర్తి సీహెచ్‌సీ, 1, 4, 6

కర్నూలు జీజీహెచ్‌, 25, 59, 55

నంద్యాల జిల్లాలో ఈ యేడాది ఇప్పటి వరకు 123 టెనిక్టమి ప్లేజ్‌ ఇంజెక్షన్లు ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement