నేడు, రేపు ఉల్లి వేలంపాట | - | Sakshi
Sakshi News home page

నేడు, రేపు ఉల్లి వేలంపాట

Sep 18 2025 7:21 AM | Updated on Sep 18 2025 7:21 AM

నేడు,

నేడు, రేపు ఉల్లి వేలంపాట

కర్నూలు(అగ్రికల్చర్‌): కర్నూలు వ్యవసాయ మార్కెట్‌ యార్డుకు ఉల్లి పోటెత్తుతోంది. మార్కెట్‌లో ఎక్కడ చూసినా ఉల్లి దిగుబడులే కనిపిస్తున్నాయి. బుధవారం 14,896 క్వింటాళ్ల ఉల్లి వచ్చింది. ఇందులో వ్యాపారులు 8,465 క్వింటాళ్లు కొనుగోలు చేశారు. నాణ్యత లేదనే కారణంలో 6,431 క్వింటాళ్లు కొనుగోలు చేయలేదు. వీటిని మార్క్‌ఫెడ్‌ కొనుగోలు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. వ్యాపారులు క్వింటాకు కేవలం రూ.50 మాత్రమే ధర కోట్‌ చేయడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. కాగా మార్క్‌ఫెడ్‌ కొనుగోలు చేసిన ఉల్లిని ఈ నెల 18, 19 తేదీల్లో మార్కెట్‌ యార్డులో బహిరంగ వేలం ద్వారా విక్రయించనున్నారు. ఈ నేపథ్యంలో 18, 19 తేదీల్లో మార్కెట్‌ యార్డులో ఉల్లి క్రయవిక్రయాలు జరుగవని జేసీ తెలిపారు.

ఆర్థిక అక్షరాస్యతపై మహిళలకు అవగాహన

వెల్దుర్తి: ఆర్థిక అక్షరాస్యతపై మహిళలకు అవగాహన కల్పిస్తున్నట్లు డీఆర్‌డీఏ జిల్లా పీడీ రమణా రెడ్డి తెలిపారు. వెల్దుర్తిలోని సీ్త్రశక్తి భవనంలో నిరక్షరాస్యులైన మహిళలకు చదువు చెప్పే మండల స్థాయి వలంటీర్‌ టీచర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శిక్షణ పొందిన వలంటీర్‌ టీచర్లకు బోధన సామగ్రి అందజేశారు. జిల్లా వయోజన విద్య అసిస్టెంట్‌ ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ బి ప్రతాప్‌, సూపర్‌వైజర్‌ రమణయ్య, వెలుగు సీసీలు, సిబ్బంది పాల్గొన్నారు.

నాల్గో విడత ఐటీఐ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

కర్నూలు సిటీ: జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ కాలేజీల్లో నాల్గో విడత ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వ ఐటీఐ బాలికల కాలేజీ ప్రిన్సిపాల్‌, జిల్లా కన్వీనర్‌ ఎల్‌.నాగరాజు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 27లోపు www.ap.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. 28వ తేదీన వెరిఫికేషన్‌ చేసి, ప్రభుత్వ కాలేజీల్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు 29వ తేదిన.. ప్రైవేటు కాలేజీల్లో దరఖాస్తు చేసుకున్న వారికి సంబంధిత కాలేజీల్లో 30వ తేదిన కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామని పేర్కొన్నారు.

ఉల్లి పంట పరిశీలనకు గ్రామ, మండల స్థాయి టీంలు

కర్నూలు(అగ్రికల్చర్‌): జిల్లాలో సాగైన ఉల్లి పంట స్థితిగతులను పరిశీలించేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసింది. గ్రామస్థాయిలో వీఆర్‌వో, రైతుసేవా కేంద్రాల ఇన్‌చార్జీలతో కమిటీలు ఏర్పాటయ్యాయి. మండల స్థాయిలో తహసీల్దారు, మండల వ్యవసాయ అధికారి, హార్టికల్చర్‌ ఆఫీసర్‌లతో టీంలు ఏర్పాటయ్యాయి. జిల్లాలో ఉద్యాన పంటల పరిస్థితి ఎలా ఉంది.. అధిక వర్షాలకు దెబ్బతినిందా.. ఇప్పటి వరకు ఎన్ని హెక్టార్లలో కోతకోశారు.. పొలాల్లో ఎంత ఉంది.. ఎకరాకు ఎన్ని క్వింటాళ్ల దిగుబడి వస్తోంది.. వారానికి ఎన్ని టన్నులు మార్కెట్‌కు వస్తుంది తదితర వివరాలపై టీంలు సర్వే చేస్తాయి. గ్రామస్థాయి టీంలు చేసే సర్వేను మండల స్థాయి టీమ్‌లు పర్యవేక్షిస్తాయి. ఈ నెల 20వ తేదీలోపు సర్వే పూర్తి చేసి జిల్లా కలెక్టర్‌కు రిపోర్టు ఇవ్వాలని జిల్లా ఉద్యాన అధికారి రాజాకృష్ణారెడ్డి గ్రామ, మండల స్థాయి టీంలను ఆదేశించారు.

ఆర్‌డబ్ల్యూఎస్‌ ఇంజనీర్స్‌ అసోసియేషన్‌ నూతన కమిటీ ఎంపిక

అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా

కె.శ్రీనాథ్‌రెడ్డి, బి.సతీష్‌

కర్నూలు(అర్బన్‌): గ్రామీణ నీటి సరఫరా విభాగం ఇంజనీర్స్‌ అసోసియేషన్‌ నూతన కమిటీ ఏర్పాటైంది. పర్యవేక్షక ఇంజనీరు సీహెచ్‌ మనోహర్‌, కర్నూలు, ఆదోని ఈఈలు అబ్దుల్‌ఖాధర్‌, ఎ.పద్మజ ఆధ్వర్యంలో జిల్లాలోని ఇంజనీర్లందరూ సమావేశమై నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అసోసియేషన్‌ జిల్లా నూతన అధ్యక్షులుగా మంత్రాలయం డీఈఈ కె.శ్రీనాథ్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా కల్లూరు ఏఈఈ బి.సతీష్‌ ఎంపికయ్యారు. ఉపాధ్యక్షులుగా ఎమ్మిగనూరు ఏఈఈ ప్రేమ్‌కుమార్‌, కోశాధికారిగా కర్నూలు డివిజన్‌ ఏఈఈ ఈకే హారిక, ఆర్గనైజింగ్‌ సెక్రెటరీగా దేవనకొండ ఏఈ మరళీమోహన్‌, మహిళా విభాగం కార్యదర్శిగా కర్నూలు సర్కిల్‌ కార్యాలయం ఏఈ వి.వేద స్వరూపను ఎన్నుకున్నారు.

నేడు, రేపు ఉల్లి వేలంపాట  1
1/3

నేడు, రేపు ఉల్లి వేలంపాట

నేడు, రేపు ఉల్లి వేలంపాట  2
2/3

నేడు, రేపు ఉల్లి వేలంపాట

నేడు, రేపు ఉల్లి వేలంపాట  3
3/3

నేడు, రేపు ఉల్లి వేలంపాట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement