
క్వింటా ఉల్లి రూ.200
● ఒక్క రైతుకూ జమకాని మద్దతు ధర ‘వ్యత్యాసం’
ఈ చిత్రంలోని రైతుపేరు సురేష్ చంద్ర. వెల్దుర్తి మండలం కాశాపురం గ్రామానికి చెందిన ఉల్లి రైతు. ఈయన 1.50 ఎకరాల్లో ఉల్లి సాగు చేశారు. దిగుబడి 70 క్వింటాళ్లు వచ్చింది. బుధవారం మార్కెట్ యార్డులో అమ్మకానికి పెట్టగా వ్యాపారులు క్వింటా రూ.200తో కొన్నారు. పెట్టుబడి రూ.1.20 లక్షల వరకు పెట్టారు. ఇంత భారీ పెట్టుబడి పెడితే రూ.14 వేలు వచ్చింది. ఈ మొత్తం ఉల్లి కోత కూలీలకు కూడా సరిపోని పరిస్థితి.