
మద్యం విక్రేత అరెస్ట్
పగిడ్యాల: ‘బడి పక్కనే మద్యం దుకాణం’ శీర్షికన సాక్షిలో గురువారం ప్రచురితమైన కథనానికి పోలీసులు స్పందించారు. పడమర ప్రాతకోట ప్రాథమిక పాఠశాల (మెయిన్) పక్కన అక్రమంగా మద్యం విక్రయిస్తున్న పులికంటి మద్దిలేటిని అరెస్ట్ చేసినట్లు నందికొట్కూరు రూరల్ సీఐ సుబ్రమణ్యం గురువారం తెలిపారు. నందికొట్కూరు పట్టణంలోని వివిధ షాపుల్లో మద్యం తెచ్చుకుని అధిక ధరలకు గ్రామంలో విక్రయిస్తుండగా ఏఎస్‌ఐ శేషయ్య సిబ్బందితో నిఘా వేసి పట్టుకున్నామన్నారు. అతని వద్ద 30 మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు సీఐ తెలిపారు.

మద్యం విక్రేత అరెస్ట్