
అవినీతి దాహం తీరేలా!
సంజామల: పశువుల దాహం తీర్చేందుకు ఊరూరా ఏర్పాటు చేసిన నీటి తొట్లు అధికారులు, టీడీపీ నాయకుల అవినీతిని ఎత్తి చూపుతున్నాయి. నాసిరకంగా నిర్మించి బిల్లులు స్వాహా చేయడంతో ప్రారంభానికి ముందే పగుళ్లు ఇస్తున్నాయి. జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద మండలానికి 19 నీటి తొట్లు మంజూరయ్యాయి. ప్రస్తుతానికి 15 పూర్తయ్యాయి. ఒక్కో తొట్టి నిర్మాణానికి రూ. 30 వేలు వెచ్చించారు. కాగా కొన్ని చోట్ల టీడీపీ నాయకులు, మరి కొన్ని చోట్ల అధికారులు నిర్మించిన నీటి తొట్లు నిరుపయోగంగా మారాయి. నాణ్యత లోపించి ప్రారంభానికి ముందే శిథిలావస్థకు చేరుకుంటున్నాయి.

అవినీతి దాహం తీరేలా!