
పట్టుబడిన మద్యం ధ్వంసం
శ్రీశైలంటెంపుల్: శ్రీశైలం ఒకటవ పోలీసు స్టేషన్ పరిధిలో గత రెండేళ్లుగా వివిధ కేసుల్లో పట్టుబడిన మద్యాన్ని ట్రాక్టర్‌తో తొక్కించి ధ్వంసం చేశారు. గురువారం శ్రీశైలంలోని డంపింగ్ యార్డ్ సమీపంలో నంద్యాల ఎకై ్సజ్ ఏఈఎస్ రాముడు, ఎకై ్సజ్ సీఐ మోహన్‌రెడ్డి, సీఐ ప్రసాదరావు, రెవెన్యూ అధికారుల సమక్షంలో మద్యం బాటిళ్లకు పంచనామా నిర్వహించి ధ్వంసం చేశారు. 15 నాటుసారా కేసుల్లో 186 లీటర్ల నాటు సారా, 17 కేసుల్లో పట్టుబడిన ఏపీ మద్యం 598 సీసాలు, 11 కేసుల్లో పట్టుబడ్డ తెలంగాణ మద్యం 599 సీసాలను ట్రాక్టర్‌తో తొక్కించారు.