
కర్నూలు సర్కిల్ అటవీ శాఖ కన్జర్వేటర్‌గా కృష్ణమూర్తి
● ఎన్‌ఎస్‌టీఆర్ ఎఫ్‌డీ పిటీగా విజయకుమార్
కర్నూలు కల్చరల్/ఆత్మకూరురూరల్: కర్నూలు సర్కిల్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్(సీఎఫ్)గా ఐఎఫ్‌ఎస్ బీవీఏ కృష్ణమూర్తి నియమితులయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఐఎఫ్‌ఎస్ బదిలీల్లో భాగంగా శ్రీశైలం ప్రాజెక్ట్ టైగర్ సర్కిల్ ఫీల్డ్ డైరెక్టర్‌గా ఉన్న ఈయనను కర్నూలుకు బదిలీ చేశారు. రాజమహేంద్రవరం ఏపీ స్టేట్ ఫారెస్ట్ అకాడమీ డైరెక్టర్‌గా ఉన్న బి. విజయకుమార్‌ను శ్రీశైలం ప్రాజెక్ట్ టైగర్ సర్కిల్ ఫీల్డ్ డైరెక్టర్‌గా బదిలీ చేశారు. ఆత్మకూరు ప్రాజెక్ట్ టైగర్ డిప్యూటీ డైరెక్టర్‌గా ఉన్న వి.సాయిబాబను తిరుపతి డీఎఫ్‌వోగా, అనంతపురం డీఎఫ్‌వో విగ్నేష్ అప్వావూను ఆత్మకూరు ప్రాజెక్ట్ టైగర్ డిప్యూటీ డైరెక్టర్‌గా బదిలీ చేస్తూ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ కె.విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.
తహసీల్దార్ కార్యాలయంలో ఇరువర్గాల ఘర్షణ
మంత్రాలయం రూరల్: భూ వివాదంతో ఏకంగా తహసీల్దార్ కార్యాలయంలోనే ఇరువర్గాల వారు ఘర్షణ పడ్డారు. ఈ ఘటన మంత్రాలయంలో గురువారం చోటు చేసుకుంది. మండల పరిధిలోని వగురూరు గ్రామంలో ఒక వ్యక్తి.. తనకు 28ఎకరాలు ఉండాల్సి ఉండగా ఒకటిన్నర ఎకర పొలం తక్కువగా ఉందని తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. సమస్యను పరిష్కారించడానికి ఇరువర్గాల వారు గురువారం తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. మాటామాటా పెరిగి ఒకరిపై ఒకరు దూషించుకున్నారు. పరస్పరం దాడులకు పాల్పడ్డారు. దీంతో అక్కడే ఉన్న ప్రజలు, రెవెన్యూ సిబ్బంది పరుగులు తీశారు. అధికారులు జోక్యం చేసుకుని ఇరువర్గాల వారిని మందలించి బయటకు పంపేశారు. దీంతో వారు పోలీస్టేషన్ చేరుకుని ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు.
ముందస్తు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలకు ఏర్పాట్లు
కర్నూలు(హాస్పిటల్): ప్రజలు క్యాన్సర్ వ్యాధిన పడకుండా ముందస్తు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అసంక్రమిత వ్యాధుల నివారణ అధికారి డాక్టర్ మహేశ్వరప్రసాద్ చెప్పారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ఆవరణలోని స్టేట్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌లో గురువారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. శిక్షణకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసే సామాజిక అధికారులు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని ఆరోగ్య కార్యకర్తలు హాజరయ్యారు. నోటి క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్‌ల స్క్రీనింగ్ గురించి పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా డాక్టర్ నాగరాజు వివరించారు. అనంతరం డాక్టర్ మహేశ్వరప్రసాద్ మాట్లాడుతూ.. క్యాన్సర్ వ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. క్యాన్సర్‌ను తొలిదశలోనే గుర్తించి చికిత్స అందిస్తే ఈ వ్యాధిని నియంత్రించవచ్చన్నారు. కర్నూలులోని స్టేట్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌లో ప్రతి మంగళ, గురువారాల్లో ఓపీ నెం.222కు రెఫర్ చేయాలని తెలిపారు. కార్యక్రమంలో వైద్యులు వెంకట సుబ్బనాగరాజు, సాహితి, జయరామ్, విజయభాస్కర్, హడస్కా, ఫ్లోరోసిస్ కన్సల్టెంట్ సుధాకర్, ఆర్‌కేఎస్‌కే కన్సల్టెంట్ మల్లికార్జున, ఫైనాన్స్ కన్సల్టెంట్ అరుణ, ప్రొజెక్షనిస్టు ఖలీల్ పాల్గొన్నారు.
కృష్ణమూర్తి, బి.విజయ్ కుమార్

కర్నూలు సర్కిల్ అటవీ శాఖ కన్జర్వేటర్‌గా కృష్ణమూర్తి

కర్నూలు సర్కిల్ అటవీ శాఖ కన్జర్వేటర్‌గా కృష్ణమూర్తి

కర్నూలు సర్కిల్ అటవీ శాఖ కన్జర్వేటర్‌గా కృష్ణమూర్తి