
పిల్లల అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన శిక్షలు
కర్నూలు: పిల్లల అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన శిక్షలు తప్పవని ఎస్పీ విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు. రైట్స్ ఫర్ చిల్డ్రన్స్ కార్యక్రమంలో భాగంగా కోనేరు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పోస్టర్‌ను ఎస్పీ శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పిల్లలకు న్యాయపరమైన హక్కులు చాలా ముఖ్యమన్నారు. బాల కార్మికులను, బాల్య వివాహాలను, పిల్లల అక్రమ రవాణాను, బాల భిక్షాటన వంటి వాటిని సమూలంగా నిర్మూలించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ తరహా ఘటనలు కనిపిస్తే వెంటనే చైల్డ్ హెల్ప్‌లైన్ 1098, 112, 100 టోల్‌ఫ్రీ నంబర్లకు సమాచారమివ్వాలని కోరారు. పిల్లల అక్రమ రవాణాలో పాల్గొనేవా రికి కఠిన శిక్షలు విధిస్తామని హెచ్చరించారు. బాలుర సంక్షేమ సమితి సభ్యుడు మధు సుధాకర్, జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ జిల్లా కోఆర్డినేటర్ మౌనిక, ఏరియా కోఆర్డినేటర్ మునుస్వామి, చైల్డ్ హెల్ప్‌లైన్ 1098 జిల్లా కోఆర్డినేటర్ సుంకన్న తదితరులు పోస్టర్ ఆవిష్కరణలో పాల్గొన్నారు.
ఎస్పీ విక్రాంత్ పాటిల్