
చెరువులకు నీరిచ్చే పనులన్నీ అప్పుడే పూర్తి చేశాం
పత్తికొండ: నియోజకవర్గంలో 64 చెరువులకు నీరందించే పనులన్నీ గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలోనే పూర్తయ్యాయని పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి అన్నారు. బాబు షూరిటీ– మోసం గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా శనివారం పత్తికొండ పట్టణంలోని లక్ష్మీనగర్‌లో ఆమె పర్యటించారు. ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. రెండు రోజుల క్రిందట క్రిష్ణగిరి మండలంలో జరిగిన కార్యక్రమంలో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఎవరో ఇచ్చిన స్క్రిప్టును చెదువుతూ అన్నీ అబద్ధాలు చెప్పారన్నారు. చెరువులకు నీరు అందించే పనులు ఎప్పుడు పూర్తయ్యాయో మైనర్ ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకోవాలని మంత్రికి సూచించారు. మద్దికెర–బురుజుల రహదారి టెండరు, అగ్రిమెంట్ పూర్తయి పనులు ప్రారంభించే సమయానికి ఎన్నికల కోడ్ రావడంతో నిలిచిపోయిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. వైఎస్సార్‌సీపీ హయాంలో పింఛన్లు, రేషన్‌కార్డులు ఇవ్వలేదని మంత్రి చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎన్నికల సమయంలో అనే హామీ లు ఇచ్చి అధికారంలోకి వచ్చారని, టీడీపీ ఎమ్మెల్యేలను ప్రజలు అడుగడుగునా నిలదీస్తున్నారన్నారు. కార్యక్రమంలో మేజర్ గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ నాగరత్నమ్మ, రాష్ట్ర మేధావుల ఫోరం అధికార ప్రతినిధి శ్రీరంగడు, బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి సోమశేఖర్, సర్పంచ్ కొమ్ముదీపిక, ఉపసర్పంచ్ పల్లె కళావతి, ఎంపీపీ నారాయణదాస్, ఎస్టీసెల్ జిల్లా అధ్యక్షుడు భాస్కర్‌నాయక్, వైఎస్సార్‌సీపీ నాయకులు కారం నాగరా జు, బాబుల్‌రెడ్డి, బనగాని శ్రీనివాసులు, వాసుదేవనాయుడు, రవిరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.
మంత్రి వాసంశెట్టి సుభాష్ చెప్పినవన్నీ
అబద్ధాలే
పత్తికొండ మాజీ ఎమ్మెల్యే
కంగాటి శ్రీదేవి