
నెలకే ‘తారు’మారు
● నాసిరకంగా బూజునూరు–గడివేముల రోడ్డు
దెబ్బతిన్న బూజునూరు – గడివేముల రహదారి
రోడ్లు వేశాం.. గుంతలు పూడ్చామని గొప్పలు చెప్పుకునే పాలకులు ఒక సారి ఆ దారుల్లో ప్రయాణించాలని ప్రజలు వాపోతున్నారు. కొత్తగా నిర్మించిన రహదారి నెలకే ఛిద్రమైతే ఎలా వెళ్లాలని ప్రశ్నిస్తున్నారు. కమీషన్లకు నాణ్యత చెదిరిపోయి, మళ్లీ గుంతలు దర్శనమిస్తున్నాయని చెప్పేందుకు బూజునూరు – గడివేముల రహదారే నిదర్శనం. బూజునూరు నుంచి గడివేముల మీదుగా మంచాలకట్ట వరకు రూ.కోట్లు ఖర్చు చేసి నూతన రోడ్డు నిర్మించారు. రోడ్డు పనులు పూర్తయ్యాయి. అయితే గడివేముల సొసైటీ సమీపంలో రోడ్డు దెబ్బతిని గుంతలమయంగా మారింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సంబంధిత కాంట్రాక్టర్ నాసిరకంగా నిర్మించి నిధులు కాజేశారనే ఆరోపణలున్నాయి. – గడివేముల