తమిళనాడు సీఎం విజయ్ మంగళవారం అన్నపూర్ణాదేవిగా కొలువైన దుర్గమ్మను దర్శించుకున్నారు. సాయంత్రం నాలుగున్నర గంటలకు ఆలయానికి చేరుకున్న విజయ్కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ ప్రధాన అర్చకుడు, వైదిక కమిటీ సభ్యులు వేద ఆశీర్వచనం అందజేయగా, దేవదాయ శాఖ కార్యదర్శి కన్నబాబు, కమిషనర్ రామచంద్రమోహన్, ఈవో శీనానాయక్, చైర్మన్ రాధాకృష్ణ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు. క్యూలైన్లో ఉన్న భక్తులకు విజయ్ అభివాదం చేశారు. విజయ్ సెక్యూరిటీ భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టంగా అమలు చేశారు.


