పామర్రు: ఓటర్ల జాబితా పారదర్శకంగా ఉండేలా జాగ్రత్తలు వహించాలని కృష్ణా జిల్లా రోల్ అబ్జర్వర్, ఐఏఎస్ అధికారి వి.శ్రీధర్ అన్నారు. పామర్రు అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల కార్యాలయంలో ఈఆర్వో అధ్యక్షతన మంగళవారం పామర్రు అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ప్రక్రియతో పాటు నూతన ఓటర్ల నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్ ప్రక్రియ పురోగతిని పరిశీలించామని, నూతన ఓటర్ల నమోదు, జాబితా పారదర్శకంగా ఉండేలా చూడాలన్నారు. అనంతరం అధికారులతో సమీక్ష సమావేశాలను నిర్వహించి సర్ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదేశించారు. కార్యక్రమంలో పామర్రు నియోజకవర్గ ఎన్నికల నమోదు అధికారి (ఆర్వో) పి.నీలకంఠేశ్వరరెడ్డి, పామర్రు తహసీల్దార్ జి.రవికాంత్, ఎన్నికల డెప్యూటీ తహసీల్దార్ బి.రజనీకాంత్, కృష్ణాజిల్లా మైనార్టీస్ సంక్షేమ అధికారి రబ్బానీ పాల్గొన్నారు.


