రైలు ఢీకొని వ్యక్తి దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

రైలు ఢీకొని వ్యక్తి దుర్మరణం

Oct 5 2026 1:27 AM | Updated on Oct 5 2026 1:27 AM

రైలు ఢీకొని వ్యక్తి దుర్మరణం

రైల్వేస్టషన్‌(విజయవాడపశ్చిమ): అజాగ్రత్తగా పట్టాలు దాటుతున్న వ్యక్తిని రైలు ఢీకొట్టడంతో అక్కడికక్కడే వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటనపై విజయవాడ జీఆర్‌పీ పోలీసులు కేసు నమోదు చేశారు. సేకరించిన వివరాల ప్రకారం.. ఆదివారం ఉదయం 8 గంటల సమయంలో రైల్వే పార్శిల్‌ కార్యాలయం సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి రైలు పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు జీఆర్‌పీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుని వయస్సు సుమారు 50 సంవత్సరాలు ఉంటుందని, వంటిపై నలుపు రంగుపై తెలుపు చారల షర్ట్‌, నలుపురంగు జీన్స్‌ ఫ్యాంటు ధరించి ఉన్నాడని, ఇతర ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుని ఆచూకి తెలిసిన వారు విజయవాడ జీఆర్‌పీ పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement