జాతీయ రహదారిపై కారు దగ్ధం | - | Sakshi
Sakshi News home page

జాతీయ రహదారిపై కారు దగ్ధం

Oct 5 2026 1:27 AM | Updated on Oct 5 2026 1:27 AM

జాతీయ రహదారిపై కారు దగ్ధం కాచవరం(ఇబ్రహీంపట్నం): షార్ట్‌ సర్క్యూట్‌తో కారులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటన ఇబ్రహీంపట్నం మండలం కాచవరం వద్ద 65వ నంబర్‌ జాతీయ రహదారిపై ఆదివారం జరిగింది. ఆ సమయంలో కారులో ఉన్న నలుగురు వ్యక్తులకు ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఎస్‌ఐ సన్యాసి నాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా తుళ్లూరు గ్రామానికి చెందిన షేక్‌ అబ్దుల్‌ కలాం తన కుటుంబ సభ్యులతో కలిసి కంచికచర్ల మండలం గొట్టిముక్కల గ్రామంలోని బంధువుల ఇంటికి కారులో బయలుదేరారు. కాచవరం పెట్రోల్‌ బంక్‌ వద్దకు రాగానే కారులో విద్యుత్‌ వైర్లు షార్ట్‌ సర్క్యూట్‌ అయి మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్‌ కారును రోడ్డు పక్కన నిలిపి వేయడంతో కారులో ఉన్న వారు సురక్షితంగా కిందికి దిగారు. క్షణాల వ్యవధిలో కారు పూర్తిగా దగ్ధమైంది. సమీపంలో ఉన్న పెట్రోల్‌ బంక్‌కు ఎటువంటి ప్రమాదం జరుగలేదు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. పోలీసలు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సముద్రంలో గల్లంతైన యువకుడు మృతి రైల్వేట్రాక్‌పై గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య ఆర్చరీ విజేతలుగా చిత్తూరు, కృష్ణా

ప్రయాణికులు సురక్షితం

కోనేరుసెంటర్‌: ప్రమాదవశాత్తు సముద్రంలో గల్లంతైన మత్స్యకారుడు మృతిచెందాడు. మృతిచెందిన యువకుడి మృతదేహాన్ని గ్రామస్తులతో పాటు మైరెన్‌ పోలీసులు గాలించి పట్టుకున్నారు. సేకరించిన వివరాల ప్రకారం.. బందరు మండలం కేపీటీపాలెంకు చెందిన తిరుమలశెట్టి గోపిరాజు (26) శనివారం తెల్లవారుజామున తల్లితండ్రులతో కలిసి చేపలవేటకు వెళ్లారు. వేట ముగించుకుని తిరిగివస్తుండగా అలల తాకిడికి బోటు తిరగబడింది. ఈ ప్రమాదంలో గోపిరాజు తల్లితండ్రులు పోతురాజు, నాగలక్ష్మీ ఈదుకుంటూ ఒడ్డుకు చేరారు. గోపిరాజు బోటు కింద పడిపోవడంతో నీటిలో గల్లంతయ్యాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు నాలుగు బృందాలుగా ఏర్పడి శనివారం ఘటన జరిగిన ప్రదేశంతో పాటు చుట్టుపక్కల గాలించారు. అయినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. ఆదివారం గ్రామస్తులతో పాటు మైరెన్‌ సిబ్బంది రంగంలోకి దిగి గాలిస్తుండగా గోపిరాజు మునిగిపోయిన ప్రదేశంలో శవమై కనిపించాడు. గోపిరాజు మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చారు. గోపిరాజు మృతితో కేపీటీపాలెం విషాదంలో నెలకొంది. కన్నబిడ్డను పోగొట్టుకున్న తల్లితండ్రులు గోపిరాజు మృతదేహాన్ని చూసి విలపించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది.

రైల్వేస్టషన్‌(విజయవాడపశ్చిమ): రైలు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై రైల్వే పోలీసులు (జీఆర్‌పీ) కేసు నమోదు చేశారు. వివరాల ప్రకారం.. నార్త్‌ ఎలక్ట్రికల్‌ క్యాబిన్‌ సమీపంలో విజయవాడ–రాజమండ్రి ప్యాసింజర్‌ వెళుతుండగా ఆదివారం గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకునేందుకు పట్టాలపై రైలుకు ఎదురు వెళ్లడంతో రైలు ఢీకొట్టి తీవ్ర గాయాలతో ట్రాక్‌ పక్కన పడిపోయాడు. దీంతో రైలును నిలిపివేసిన లోకోపైలట్‌ స్టేషన్‌ అధికారులకు సమాచారం అందించడంతో జీఆర్‌పీ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని బాధితుడిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడి వైద్యులు పరిక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. దీనిపై విజయవాడ జీఆర్‌ీపీ హెడ్‌ కానిస్టేబుల్‌ రాజా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుని వయస్సు సుమారు 40–45 సంవత్సరాల మధ్య ఉంటుంది. బట్టతల కలిగి, ఒంటిపై ముదురు గులాబీ రంగు టీషర్ట్‌, బూడిద రంగు నిక్కరు ధరించి ఉన్నాడు. ఇతర ఎటువంటి ఆధారాలు లభించలేదు. మృతుని ఆచూకి తెలిసిన వారు సెల్‌: 94414 69287 నంబర్‌కు సమాచారం అందిచాలని కోరారు.

భీమవరం: రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలు ఉత్సాహంగా జరిగాయి. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం ఎస్‌ఆర్‌కేఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో మూడు రోజులపాటు ఆంధ్రప్రదేశ్‌ ఆర్చరీ అసోసియేషన్‌, వెస్ట్‌ గోదావరి డిస్ట్రిక్ట్‌ ఆర్చరీ అసోసియేషన్‌ సంయుక్తంగా నిర్వహించారు. విజేతలు వచ్చేనెలలో సిక్కింలో జరిగే జాతీయస్థాయి పోటీలకు హాజరుకానున్నారు. ఆదివారం జరిగిన సీనియర్‌ ఇండియన్‌ రౌండ్‌ ఉమెన్‌ విభాగంలో చిత్తూరుకు చెందిన కె.సాయి సుజియ, కె.మోక్ష, కరణి లోహితరెడ్డి మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. నాలుగో స్థానంలో వైఎస్సార్‌ కడపకు చెందిన చింతపల్లి గ్రీష్మ సాయిశ్రీ నిలిచింది. సీనియర్‌ రికర్వ్‌ ఉమెన్‌ విభాగంలో కృష్ణా జిల్లాకు చెందిన కొండపావులూరి ఉత్కశ్రీ, కుండేరు చంద్రహాస్ని, తాడిబోయిన వైష్ణవి, ఆకుల రవళి మొదటి నాలుగు స్థానాల్లో నిలిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement