కుటుంబాలు ఐక్యంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

కుటుంబాలు ఐక్యంగా ఉండాలి

Oct 5 2026 1:27 AM | Updated on Oct 5 2026 1:27 AM

కుదరవల్లి ఆత్మీయ సమావేశంలో నందమూరి రామకృష్ణ

లబ్బీపేట(విజయవాడతూర్పు): కుటుంబాలు ఎల్లప్పుడూ ఐక్యంగా ఉండాలని, నేటి తరానికి మన మూలాలు, తాత, ముత్తాతల చరిత్రను తెలియజెప్పాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైనే ఉందని నందమూరి రామకృష్ణ అన్నారు. విజయవాడలోని బెంజ్‌సర్కిల్‌ సమీపంలోని జ్యోతి కన్వెన్షన్‌ హాల్‌లో ఆదివారం ‘కుదరవల్లి’ వారి ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన నందమూరి రామకృష్ణ కుదరవల్లి వారి ‘వంశ వృక్షం’ చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి అవార్డు గ్రహీత అడ్మిరల్‌ నేవీ కుదరవల్లి శ్రీనివాస్‌ను ఘనంగా సత్కరించారు. రామకృష్ణ మాట్లాడుతూ నిమ్మకూరు గ్రామస్తులందరినీ ఒకే వేదికపై కలుసుకోవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. తాతలు, ముత్తాతల విశేషాలను పిల్లలకు తల్లిదండ్రులే వివరించాలని, అలా చెప్పకపోతే రేపటి రోజున వారికి మీరు కూడా గుర్తుండరని అన్నారు. కుదరవల్లి వారి చరిత్రకు సంబంధించి దాదాపు 400 ఏళ్ల నాటి ప్రాచీన పుస్తకం లభించడం అభినందనీయమన్నారు. సురక్షా కన్వీనర్‌ కుదరవల్లి నరసయ్య, కుదరవల్లి బోస్‌, సూరపనేని హనుమంతరావు, ప్రవీణ్‌ చంద్రపాల్గొన్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement