అరుదైన శస్త్రచికిత్స విజయవంతం | - | Sakshi
Sakshi News home page

అరుదైన శస్త్రచికిత్స విజయవంతం

Oct 4 2026 10:55 AM | Updated on Oct 4 2026 10:55 AM

లబ్బీపేట(విజయవాడతూర్పు): అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో 18 ఏళ్ల యువతికి ఏబీఓ ఇన్‌కంపాటిబుల్‌ కిడ్నీ మార్పిడి సర్జరీ విజయవంతంగా నిర్వహించినట్లు ప్రముఖ నెఫ్రాలజిస్ట్‌ డాక్టర్‌ జి.శరత్‌బాబు తెలిపారు. ఆమె గుండె రక్తాన్ని పంప్‌ చేసే సామర్ధ్యం కేవలం 25 శాతం మాత్రమే ఉన్నప్పటికీ కార్డియాలజీ నిపుణులు, ఇతర విభాగాల వైద్య బృందం సహాయంలో విజయవంతంగా కిడ్నీ మార్పిడి చేసినట్లు తెలిపారు. విజయవాడ సూర్యారావుపేటలోని విజయ సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రిలో శనివారం నిర్వహించిన సమావేశంలో సర్జరీ గురించి ఆయన వివరించారు. గతంలో ట్రాన్స్‌ప్లాంట్‌ చేయించకున్న తర్వాత మళ్లీ కిడ్నీ ఫెయిల్యూర్‌ అయిన కొందరు రోగులకు వారి ఆరోగ్య పరిస్థితిని బట్టి మరోసారి ట్రాన్స్‌ప్లాంట్‌ చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. దీంతో తమ ఆస్పత్రిలో ఒక రోగికి మూడు సార్లు కిడ్నీ మార్పిడి సర్జరీని విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. సమావేశంలో ఆస్పత్రి ఛైర్మన్‌ వెంకటరావు, రేడియాలజిస్ట్‌ డాక్టర్‌ ప్రశాంతి, యూరాలజీ నిపుణులు డాక్టర్‌ సంపత్‌, డాక్టర్‌ ధీరజ్‌, ఎనస్థీషియా నిపుణులు డాక్టర్‌ శైలజలు పాల్గొన్నారు.

25 శాతం గుండె పంపింగ్‌ ఉన్న యువతికి కిడ్నీ మార్పిడి సర్జరీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement