పెనమలూరు: సైబర్ మోసపాలపై అందరూ అప్రమత్తంగా ఉండాలని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖర్‌బాబు అన్నారు. కానూరులోని సిద్ధార్థ డీమ్డ్ టుబీ యూనివర్సీటలో శనివారం ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్ 3, అసోసియేషన్ ఆఫ్ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్, లయన్స్‌క్లబ్ ఆఫ్ విజయవాడ (సంఘటిత) ఆధ్వర్యంలో సైబర్ నేరాల నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ప్రస్తుత డిజిటల్ యుగంలో రోజురోజుకు వివిధ రకాల సైబర్ నేరాలు పెరుగుతున్నాయన్నారు. విద్యార్థులు సైబర్ మోసాలపై అవగాహన పొంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆన్‌లైన్ లోన్ యాప్‌లు, పార్ట్ టైమ్ ఉద్యోగాలు, షేర్‌మార్కెట్ ఇలా అనేక రకాల మోసాలు జరుగుతున్నాయని వివరించారు. మోసానికి గురైన వారు వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు ఫొన్ చేయాలని సూచించారు. ఈ సందర్భంగా వర్సీటీలో సీపీని సత్కరించారు. కార్యక్రమంలో డైరెక్టర్ బి.పాండురంగారావు, రిజిస్ట్రార్ డాక్టర్ ఎం.రవిచంద్, లయన్స్ గవర్నర్ ప్రసాద్, ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ శివరామ్‌ప్రసాద్, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ యు.వి.నారాయణరావు, పలువురు పాల్గొన్నారు.
సీపీ ఎస్.వి.రాజశేఖర్‌బాబు


