ఆగి ఉన్న లారీని ఢీకొన్న బైక్‌ | - | Sakshi
Sakshi News home page

ఆగి ఉన్న లారీని ఢీకొన్న బైక్‌

Oct 4 2026 10:55 AM | Updated on Oct 4 2026 10:55 AM

ఆగి ఉన్న లారీని ఢీకొన్న బైక్‌

ఒకరు మృతి మరొకరికి తీవ్ర గాయాలు

కృత్తివెన్ను: ఆగి ఉన్న లారీని ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ఒకరు అక్కడిక్కడే మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మండల పరిధిలోని లక్ష్మీపురం రంగా సెంటర్‌ సమీపంలో 216 జాతీయ రహదారిపై శనివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. కృత్తివెన్ను ఎస్‌ఐ పైడిబాబు తెలిపిన వివరాల మేరకు.. పశ్చిమ గోదావరి జిల్లా నాగిడిపాలేనికి చెందిన తిరుమాని మురళి (24), తిరుమాని రామకృష్ణ (24) లక్ష్మీపురం నుంచి మోటార్‌ బైక్‌పై స్వగ్రామం వెళుతున్నారు. రంగా సెంటర్‌ దాటిన తర్వాత రోడ్డుపై నిలిపి ఉన్న లారీని బలంగా ఢీకొట్టారు. ఈ ఘటనలో మురళి అక్కడిక్కడే మృతిచెందగా రామకృష్ణకు తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన రామకృష్ణను 108 ద్వారా భీమవరం హాస్పిటల్‌కు తరలించారు. యువకులు ఇరువురు అవివాహితులు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement