డబ్బులు ఊరికే వెళ్లవు! | - | Sakshi
Sakshi News home page

డబ్బులు ఊరికే వెళ్లవు!

Sep 17 2026 2:26 AM | Updated on Sep 17 2026 2:26 AM

గురువారం శ్రీ 17 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026 డబ్బులు ఊరికే వెళ్లవు! u8లో ఉత్సాహంగా పికిల్‌ బాల్‌ టోర్నీ మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): స్థానిక భారతీనగర్‌లోని నైట్రో పికిల్‌ బాల్‌ గ్రౌండ్‌లో డాక్టర్స్‌ స్పోర్ట్స్‌ అకాడమీ ఆధ్వర్యంలో డాక్టర్స్‌ పికల్‌ బాల్‌ లీగ్‌ సీజన్‌–1 ఉత్సాహంగా బుధవారం జరిగాయి. ఈ లీగ్‌లో విజయవాడ, గుంటూరు, రాజమండ్రి ప్రాంతాలకు చెందిన వైద్యులు పాల్గొని తమ పికిల్‌ బాల్‌ క్రీడలో తమ ప్రతిభను చాటుకున్నారు. లీగ్‌లో డాక్టర్‌ కానూరు రవి ప్రాతినిధ్యం వహించిన బాపయ్య బ్రాట్‌ స్పార్టన్స్‌ జట్టు అద్భుతమైన ఆటతీరుతో విజేతగా నిలిచింది. డాక్టర్‌ రాకేష్‌ సారథ్యంలోని స్వరా పికిల్‌ బాల్‌ టీమ్‌ రన్నరప్‌గా నిలిచింది. ఈ లీగ్‌ను తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ అతిథిగా హాజరై ప్రారంభించారు. శ్రీనిలయ ఇన్‌ఫ్రా గ్రూప్‌ చైర్మన్‌ అమరనేని వెంకట్రావు హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. ఈవెంట్‌ ఆర్గనైజర్స్‌ డాక్టర్‌ తమ్మారెడ్డి సందీప్‌, డాక్టర్‌ అక్కినేని శివరామ్‌ పాల్గొన్నారు. ఐఆర్‌ ప్రకటించాలని డిమాండ్‌ గన్నవరం: రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పీఆర్సీ కమిటీ నియమించడంతో పాటు ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఐఆర్‌ను ప్రకటించాలని ఏఐఎస్టీఎఫ్‌ జాతీయ ఆర్థిక కార్యదర్శి సీహెచ్‌ జోసఫ్‌ సుధీర్‌బాబు డిమాండ్‌ చేశారు. స్థానిక జెడ్పీ బాలురు, బాలికల హైస్కూల్స్‌లో ఎస్టీయూ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన ఉపాధ్యాయుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుధీర్‌బాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్య వైఖరిని అవలంభిస్తోందన్నారు. తెలంగాణ ప్రభుత్వం రెండు న్నరేళ్ల క్రితం ఐఆర్‌ను ప్రకటించి ఉద్యోగుల అభిమానం చూరగొన్నారని చెప్పారు. ఇక్కడ మాత్రం పీఆర్సీ గడు వు ముగిసి మూడేళ్లయిన ఇప్పటి వరకు పీఆర్సీ కమిటీగాని, ఐఆర్‌ ప్రకటన చేయలేదన్నారు. ఉపాధ్యాయులపై యాప్‌ల పనిభారం తగ్గించాలని ఎస్టీయూ రాష్ట్ర కార్యదర్శి దేవరపల్లి విద్యాసాగర్‌ కోరారు. ఎస్టీయూ జిల్లా అదనపు ప్రధాన కార్యదర్శి సీహెచ్‌ కృష్ణారావు, మండల అధ్యక్షుడు ఎం. ఆనంద్‌కుమార్‌, మాజీ రాష్ట్ర సభ్యుడు డి. సామ్యూల్‌ ప్రసాద్‌ పాల్గొన్నారు. ఘనంగా ఓజోన్‌ దినోత్సవం కలంకారీలో రసాయనాలపై విచారణకు ఆదేశం అనివార్యమైన యూపీఐ లావాదేవీలు.. వ్యాపారులపైనా భారం..

న్యూస్‌రీల్‌

భారం తప్పదు..

సామాన్యులకు షాక్‌ ఇచ్చిన యూపీఐ చార్జీలు

గురువారం శ్రీ 17 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026

రూ.2000 దాటిన

లావాదేవీలపై చార్జీలు

అక్టోబర్‌ 15 నుంచి ప్రారంభం

రైల్వే, టెలికం లావాదేవీలపైనా వడ్డన

ఉమ్మడి జిల్లాలో 15 లక్షల

కుటుంబాలపై భారం

కోనేరుసెంటర్‌: ప్రపంచ ఓజోన్‌ దినోత్సవాన్ని పురస్కరించుకుని కృష్ణా విశ్వవిద్యాలయం ఎన్‌సీసీ విభాగం ఆధ్వర్యంలో బుధవారం అవగాహన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణలో యువత పాత్రను చాటిచెప్పే లక్ష్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయం ఎన్‌సీసీ క్యాడెట్లు పాల్గొని ఓజోన్‌ పొర పరిరక్షణ, పర్యావరణ పరిరక్షణ, భవిష్యత్‌ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించాల్సిన బాధ్యతపై అవగాహన కల్పించారు. అనంతరం కృష్ణా విశ్వవిద్యాలయం ఎన్‌సీసీ క్యాడెట్లు ఓజోన్‌ పరిరక్షణపై అవగాహన ప్రతిజ్ఞ చేశారు.

పెడన: కలంకారీ పరిశ్రమలో రంగుల నిమిత్తం క్యాన్సర్‌ కారకమైన, ప్రమాదకరమైన రసాయనాల వాడకంపై ఆర్‌టీఐ కార్యకర్తలు జంపాన శ్రీనివాస్‌గౌడ్‌, బేతపూడి జోగేశ్వరరావు, శిరివెళ్ల గౌరి రాష్ట్ర లోకాయుక్తకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో లోకాయుక్త విచారణకు ఆదేశించారు. ఈ మేరకు జంపాన శ్రీనివాస్‌ గౌడ్‌ బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఏపీ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు, మెంబర్‌ సెక్రటరీని విచారణకు ఆదేశిస్తూ పర్యావరణ అటవీ శాఖల ముఖ్యకార్యదర్శి శ్రీకాంతిలాల్‌ దండే ఉత్తర్వులు జారీ చేశారని ఆయన పేర్కొన్నారు. రంగుల నిమిత్తం కలంకారీ పరిశ్రమలలో వాడుతున్న క్యాన్సర్‌ కారకమైన ప్రమాదకరమైన రసాయనాల వినియోగంపై ఏపీ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు, మెంబర్‌ సెక్రటరీ, ఐఎఫ్‌ఎస్‌ విజయవాడకు చెందిన ఎస్‌. శ్రీశరవణన్‌ను విచారణ అధికారిగా నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయన్నారు. ఈ ఏడాది జూన్‌ 20న చేసిన ఫిర్యాదుపై రాష్ట్ర లోకాయుక్త జస్టిస్‌ పి. రజని ఆదేశాల మేరకు పర్యావరణ అటవీ శాఖల ముఖ్యకార్యదర్శి ఉత్తర్వులు ఇచ్చారన్నారు.

● ఇలా ప్రసాద్‌ కుటుంబం మాత్రమే కాదు.. దాదాపు ప్రతి కుటుంబం కూడా ప్రతి చిన్న, పెద్ద లావాదేవీ ఏదైనా యూపీఐనే అధికంగా వాడుతున్నారు. అయితే వీటిపై చార్జీలు విధిస్తారన్న అంశం ఇప్పుడు జిల్లాలో హాట్‌ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం ప్రభుత్వం ప్రకటించిన అంశాల్లో కొన్ని రకాల లావాదేవీలపైన మాత్రమే చార్జీలు అని భావిస్తున్నా, రానున్న కాలంలో అన్నింటిపైనా ఈ భారాలు వడ్డించే ప్రమాదం లేకపోలేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): సగటు వ్యక్తి జీవితంలో యూపీఐ లావాదేవీలు చాలా కీలకంగా మారాయి. ఉదయం నుంచి రాత్రి వరకూ ఏ ఖర్చు చేయాలన్నా, ఎక్కడికి నగదు పంపాలన్నా.. తీసుకోవాలన్నా యూపీఐనే ఆశ్రయిస్తున్నారు. దాంతో తప్పనిసరిగా ప్రతి వ్యక్తి జీవితంలో ఈ డిజిటల్‌ లావాదేవీలు భాగమైపోయాయి. అయితే ఇప్పటి వరకూ దానిపై ఎటువంటి అదనపు చార్జీలు లేవు. కానీ వచ్చే అక్టోబర్‌ 15 నుంచి రెండు వేల దాటిన లావాదేవీలపై చార్జీలు పడటంపై సామాన్యులు భయపడుతున్నారు. దానితో పాటుగా రూ.75వేలు కన్నా అధికంగా చేసే వాటిపై గరిష్టంగా రూ.300 వరకూ భారం పడనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాకుండా టెలికాం, రైల్వే టికెట్‌ వంటి లావాదేవీలపైనా చార్జీలు భారీగానే ఉండనున్నట్లు ప్రభుత్వ ప్రకటన చూస్తే అర్థమవుతోంది.

ఎన్టీఆర్‌ జిల్లాలోనే 56 లక్షలకు పైగా బ్యాంకు ఖాతాలు ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. జనాభా కన్నా ఖాతాలు ఎక్కువగా ఉండటానికి కారణం ఒక్కొక్కరికీ రెండు కన్నా అధికంగా ఉండటమే. గడిచిన దశాబ్ద కాలంగా బ్యాంకులు ఏటీఎంలపైనా ఖాతాదారులపై అనేక రూపాల్లో భారాలను మోపుతున్నాయి. నెలకు ఐదు పర్యాయాలు మాత్రమే ఏటీఎం ద్వారా నగదు తీసుకోవటానికి లేదా మినీ స్టేట్‌మెంట్‌ తీసుకోవటానికి అవకాశం కల్పిస్తున్నాయి. అంతకుమించిన లావాదేవీలపై భారీగా వడ్డన చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ యూపీఐ లావాదేవీలను ఆశ్రయిస్తున్నారు. వాటి ద్వారానే ఎంతటి నగదు మొత్తానైనా చెల్లింపు చేస్తున్నారు. వాటి ద్వారానే మొత్తం వస్తువులను కొనుగోలు చేస్తున్నారు.

రాష్ట్రంలో ఉమ్మడి కృష్ణాజిల్లా వాణిజ్య రాజధానిగా ఉంది. రాష్ట్రంలో అత్యధిక జీఎస్‌టీ వసూళ్లు ఉమ్మడి కృష్ణాజిల్లాలోనే జరుగుతున్నట్లు ప్రభుత్వ నివేదికలు చెబుతున్నాయి. ఆ క్రమంలో రానున్న కాలంలో యూపీఐ లావాదేవీలపై వ్యాపారులపై వడ్డన పడనుంది. తద్వారా రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న ఉమ్మడి జిల్లా వ్యాపారులపై యూపీఐ లావాదేవీలకు జరిగే అదనపు చెల్లింపులు భారం కాక తప్పదని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. అక్టోబర్‌ 15వ తేదీ నుంచి ఈ వడ్డింపులు ప్రారంభమవుతాయని ప్రకటనలు వెలువడిన నేపథ్యంలో వ్యాపారులు సైతం దీనిపై ఆందోళన చెందుతున్నారు.

● విజయవాడలోని కొత్తపేటకు చెందిన ప్రసాద్‌బాబు ఉదయం బయటకు వచ్చి పాలప్యాకెట్‌ తీసుకొని యూపీఐ ద్వారా నగదు చెల్లించాడు. అనంతరం అక్కడి నుంచి టిఫిన్‌ సెంటర్‌కు వెళ్లి అక్కడా యూపీఐ ద్వారానే డబ్బులు చెల్లించాడు. మళ్లీ ఇంటి నుంచి తన కార్యాలయానికి వెళ్లేందుకు ఆటో ఎక్కాడు. తన గమ్యస్థానం వచ్చిన తరువాత ఆటోడ్రైవర్‌కు సైతం ఇదే విధంగా నగదు చెల్లింపు చేశాడు. అలాగే ఉదయం నుంచి తిరిగి రాత్రి నిద్రపోయేంత వరకూ తాను చెల్లించే ప్రతి రూపాయి యుపీఏ ద్వారానే చెల్లింపు చేస్తూ వచ్చాడు. అతనే కాదు కుటుంబ సభ్యులు సైతం ఇదే తరహాలో చెల్లింపులు చేస్తున్నారు. మొత్తం మీద ఆ కుటుంబ సభ్యులందరూ కలిసి ప్రతి రోజూ కనీసం 10 నుంచి 20 వరకూ యూపీఐ లావాదేవీలు చేస్తున్నారు.

కృష్ణాజిల్లా, చల్లపల్లి మండలంలో నాట్లు పడని పంట పొలాలకు మేక, గొర్రె మందలకు ఆవాసాలుగా మారుతున్నాయి. 2026 ఖరీఫ్‌ సీజన్‌లో మండలంలో 13,140 ఎకరాలు సాగు విస్తీర్ణం ఉండగా ఇంకా 1,100 ఎకరాల్లో నాట్లు పడలేదు. ఈ సమయానికి పచ్చని పైరుతో రెపరెలాడాల్సిన పంట పొలాల్లో చుక్క నీరు కూడా లేకపోవటంతో బీడు భూములుగా దర్శనమిస్తున్నాయి. ఖాళీ పొలాల్లో గొర్రె మందలను రైతులు వదిలేస్తున్నారు. ఇప్పటికై నా సాగునీటిని విడుదల చేయాలని రైతన్నలు కోరుతున్నారు. – చల్లపల్లి

ఉమ్మడి జిల్లాలో సుమారుగా 15 లక్షల కుటుంబాలు ఉన్నట్లు ప్రభుత్వ నివేదికలు చెబుతున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం పూర్వ కృష్ణాజిల్లాలో 12.5 లక్షల కుటుంబాలు కాగా ఆ సంఖ్య నేడు 15 లక్షలకుపైగా పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. ప్రతి ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని బ్యాంకు ఖాతాలు తప్పనిసరిగా మారాయి. బ్యాంకు ఖాతా కలిగిన ప్రతి ఒక్కరూ యూపీఐ లావాదేవీలను నిర్వహిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో నిర్దిష్టంగా ఇంతమంది యూపీఐ లావాదేవీలను నిర్వహిస్తున్నట్లుగా ఎక్కడా అధికారిక గణాంకాలు లేకపోయినా కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాలో సుమారుగా 43 లక్షల జనాభా ఉన్నారు. అందులో 35 లక్షలకు పైగా యూపీఐ లావాదేవీలను నిర్వహిస్తున్నట్లు అంచనా. వీరందరిపైనా ఈ భారం పడనున్నట్లు ఆయా కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement