ఏకోపాధ్యాయ.. పాఠం గయా | - | Sakshi
Sakshi News home page

ఏకోపాధ్యాయ.. పాఠం గయా

Sep 17 2026 2:26 AM | Updated on Sep 17 2026 2:26 AM

● అవనిగడ్డ నియోజకవర్గంలోని అవనిగడ్డ, కోడూరు, నాగాయలంక, మోపిదేవి, చల్లపల్లి, ఘంటసాల మండలాల్లో 246 పాఠశాలల్లో 101 ఏకోపాధ్యాయ పాఠశాలలే. 2025 తరువాత పిల్లలు లేక ఏడు పాఠశాలలు మూతపడ్డాయి. నాగాయలంక మండలం వక్కపట్లవారిపాలెం పంచాయతీ బ్రహ్మానంపురం ప్రాథమిక పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు, ఎనిమిది మంది విద్యా ర్థులు ఉన్నారు. సాక్షి విజిట్‌ చేసిన సమయంలో టీచర్‌ కుర్చీకి పరిమితమవగా బయటి వ్యక్తి పిల్లలకు పాఠం చెప్పడం కనిపించింది. ● పెడన నియోజకవర్గంలో 105 ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక పెడన మండలంలో నాలుగు, బంటుమిల్లి మండలంలో రెండు ఎంపీపీ స్కూళ్లు మూతపడ్డాయి. పెడన మండలం చిన్ననందమూరు ఎలిమెంటరీ పాఠశాలలో 12 మంది విద్యార్థులకు ఒక్కరే టీచర్‌ ఉన్నారు. ఈ పాఠశాలకు భవనం లేక అంగన్‌వాడీ కేంద్రం వరండాలోనే పిల్లలకు పాఠాలు బోధిస్తున్నారు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో సకల వసతులతో తీర్చిదిద్దిన పెడన మండలం లంకల కలవగుంట ఎంపీపీ స్కూల్‌ కూటమి ప్రభుత్వం వచ్చాక మూతబడింది. ● గుడివాడ నియోజకవర్గంలో 15 ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వంలో గుడివాడ మండలం చిరిచింతల గ్రామంలో స్కూల్‌ మూతపడింది. ● గన్నవరం నియోజకవర్గం గన్నవరం మండ లంలో ఎనిమిది, బాపులపాడు మండలంలో 15 ఏకోపాధ్యాయ స్కూళ్లు ఉన్నాయి. ● పామర్రు నియోజకవర్గంలో మొత్తం 246 పాఠశాలల్లో 78 ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయి.

ఏకోపాధ్యాయ పాఠశాలలుసమస్యలతో సతమతం ఏదైనా కారణంతో టీచర్‌ రాకుంటే బడికి సెలవే.. ప్రభుత్వ నిర్లక్ష్యంతో పేద విద్యార్థుల భవిష్యత్‌పై ప్రభావం చంద్రబాబు, లోకేష్‌ తీరుపై తల్లిదండ్రులు, విద్యావేత్తల ఆగ్రహం

సాక్షి, విజయవాడ: కృష్ణా జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యం అవుతున్నాయి. జిల్లాలో ఏకోపాధ్యాయ పాఠ శాలలు ఎక్కువయ్యాయి. ప్రభుత్వ పాఠశాలలపై చంద్రబాబు ప్రభుత్వం వహిస్తున్న నిర్లక్ష్యం పేద విద్యార్థుల బంగారు భవిష్యత్‌పై దుష్ప్రభావం చూపుతోంది. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతో కళకళలాడాయి. మనబడి నాడు – నేడు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలు ఆధునిక తను సంతరించకున్నాయి. ఇంగ్లిష్‌ ల్యాబ్‌లు, డిజిటల్‌ క్లాస్‌ రూమ్‌లు, గ్రీన్‌ చాక్‌ బోర్డులు, కూర్చునేందుకు టేబుళ్లు, తరగతి గదుల్లో ఫ్యాన్లు, విద్యుత్‌ బల్బులు, మంచినీటి సరఫరాకు ఆర్వో ప్లాంట్‌లు, నీటి వసతితో కూడి మరుగుదొడ్లు, చుట్టూ ప్రహరీలు వంటి వసతులతో కార్పొరేట్‌ స్కూళ్లకు దీటుగా నిలిచాయి. విద్యార్థులకు షూ, టై, బెల్టు, బ్యాగ్‌, బైలింగ్వల్‌ పాఠ్యపుస్తకాలను ఉచితంగా అందజేశారు. పార్టీలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా అమ్మఒడి పథకం అమలుచేశారు. 8వ తర గతి నుంచే ట్యాబ్‌లు ఇచ్చి సాంకేతిక విద్యను పేద విద్యార్థుల చెంతకు చేర్చారు. ఫలితంగా డ్రాప్‌ఔట్లు తగ్గి, పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది.

432 ఏకోపాధ్యాయ పాఠశాలలు

కృష్ణా జిల్లాలో ఎంపీపీ, జెడ్పీ, మునిసిపల్‌ యాజమాన్యాల్లో మొత్తం 1,318 పాఠశాలలు ఉన్నాయి. వాటిలో 432 పాఠశాలలు ఏకోపాధ్యాయ బడు లుగా మారాయి. అత్యధికంగా గుడ్లవల్లేరు, గూడూరు మండలాల్లో 31 పాఠశాలలకు ఒక్కొక్క ఉపాధ్యాయుడే ఉన్నారు. ఈ పాఠశాలల్లో టీచర్లు సెలవు పెడితే క్లస్టర్‌ రిసోర్స్‌ పర్సన్లకు (సీఆర్పీ) డ్యూటీలు వేస్తున్నారు. వారు కూడా సెలవులో ఉన్నప్పుడు ఆ రోజు ఆయా స్కూళ్లకు అనధికారికంగా సెలవు ఇవ్వక తప్పని పరిస్థితి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement