గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఈ ఏడాది నవంబర్ 21, 22 తేదీల్లో విజయవాడ నగరంలోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో అయ్యప్ప మహా సంకల్పం – మహా పడిపూజ, భజన మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతాయని ఆర్గనైజింగ్ కమిటీ తెలిపింది. ప్రెస్‌క్లబ్‌లో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో సీఏ అక్కయ్యనాయుడు మాట్లాడుతూ.. శబరిమల ఆలయ మాజీ మేల్శాంతి చేతుల మీదుగా మహా పడిపూజ నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ మహోత్సవ పోస్టర్ ఆవిష్కరణ, ‘శుభారంభ శంఖారావం – గురుస్వామి సమ్మేళనం’ కార్యక్రమం అక్టోబర్ నాలుగో తేదీ ఉదయం తొమ్మిది గంటలకు గవర్నర్ పేటలోని ఐవీ ప్యాలెస్‌లో జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి శబరిమల మాజీ మేల్శాంతి దామోదరన్ పొట్టి, అక్షయపాత్ర అధ్యక్షుడు వంశీధర దాస్, ఏబీఏపీ జాతీయ అధ్యక్షుడు అయ్యప్ప దాస్ హాజరవుతారని పేర్కొన్నారు. ధర్మ ప్రచార సభ రాష్ట్ర అధ్యక్షుడు సీతారాం గురుస్వామి మాట్లాడుతూ.. దక్షిణ భారతదేశం మొత్తం నుంచి గురుస్వాములు పాల్గొంటారని తెలిపారు. ఈ సమావేశంలో కన్వీనర్ కృష్ణ ప్రసన్న, కో చైర్మన్ ఎ. గురునాథ్, కోశాధికారి తొండెపు ప్రసాద్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.


