ప్రైవేటు విద్యాసంస్థల్లో పిల్లల సంఖ్యను పెంచడానికే ప్రభుత్వ పాఠశాలల్లో కూటమి ప్రభుత్వం ప్రమాణాలను తగ్గిస్తోంది. ఏకోపాధ్యాయ పాఠశాలలో టీచర్ రాకపోతే బడి ఉండదు. తల్లిదండ్రులు అప్పు చేసైనా తమ పిల్లలను ప్రైవేట్ స్కూళ్లలో చేరుస్తారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగిందని ప్రభుత్వం చెబుతున్నా, వాస్తవంగా ఐదు లక్షల మంది తగ్గిపోయారు. ఇదే సమయంలో ప్రైవేట్ స్కూల్లో సంఖ్య పెరిగింది.
– రవిచంద్ర, వైఎస్సార్ సీపీ స్టూడెంట్ విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్


