పనితీరు మారకపోతే చర్యలు తప్పవు ఘంటసాల: మండలంలోని మూడు పీహెచ్‌సీల్లోని సిబ్బంది నెలరోజుల్లో పనితీరు మార్చుకోకపోతే శాఖాపరమైన చర్యలు తప్పవని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి పీఎల్ దయాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘంటసాల మండలంలోని ఘంటసాల, ఘంటసాల పాలెం, శ్రీకాకుళం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను(పీహెచ్‌సీ) డీఎంహెచ్‌ఓ దయాకర్ మంగళవారం ఆకస్మిక తనఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా మూడు పీహెచ్‌సీల్లోని రికార్డులు, రక్త పరీక్ష కేంద్రాలు, వ్యాక్సినేషన్లు, మందులను పరిశీలించారు. ఫీల్డ్ సిబ్బంది నిర్వహించే మూవ్‌మెంట్ రిజిస్టర్లు, టూర్ డైరీలు, మందుల స్టాకు వివరాలు సక్రమంగా లేకపోవడంపట్ల అసహనం వ్యక్తం చేశారు. ఘంటసాల పీహెచ్‌సీలో అనారోగ్యంతో చికిత్స పొందు తున్న మహిళను డీఎంహెచ్‌ఓ స్వయంగా పలకరించి సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. డీఎంహెచ్‌ఓ సీసీ తికుళ్ల హనుమంతురావు, ఘంటసాలపాలెం, శ్రీకాకుళం పీహెచ్‌సీ డాక్టర్లు, ఎంపీహెచ్‌ఓలు, స్టాఫ్ నర్సులు, సిబ్బంది పాల్గొన్నారు.
ముగిసిన సర్టిఫికెట్ల పరిశీలన మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): నగరంలోని రమేష్ ఆస్పత్రి సమీపంలో ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలోని ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ సెంటర్‌లో జరుగుతున్న ఏపీఈఏపీ సెట్–2026(బైపీసీ స్ట్రీమ్) స్పెషల్ కేటగిరి ర్యాంకర్ల సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ మంగళవారం సాయంత్రంతో ముగిసింది. ఎన్‌సీసీ–22, స్పోర్ట్స్ అండ్ గేమ్స్–14, సీఏపీ–12, స్కౌట్స్ అండ్ గైడ్స్–2 మొత్తం 50 మంది సర్టిఫికెట్లను మంగళవారం పరిశీలించామని హెల్ప్‌లైన్ సెంటర్ కో–ఆర్డినేటర్ ఎం.విజయసారథి చెప్పారు. మంగళవారం సాయంత్రంతో స్పెషల్ కేటగిరి ర్యాంకర్ల సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ పూర్తి అయ్యిందని, సాధారణ కేటగిరి ర్యాంకర్ల సర్టిఫికెట్ల పరిశీలనను ఆన్‌లైన్‌లోనే పూర్తి చేశామని తెలిపారు. సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి అయిన వారు ఈ నెల 23వ తేదీలోగా ఆన్‌లైన్‌లో వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని, నమోదు చేసుకున్న వెబ్ ఆప్షన్లలో మార్పులు చేర్పులకు ఈ నెల 24వ తేదీన అవకాశం ఉంటుందని, ఈ నెల 27వ తేదీన ఆన్‌లైన్‌లో సీట్ ఎలాట్‌మెంట్‌ను ప్రకటిస్తారని తెలిపారు. వైభవంగా సుబ్రహ్మణ్య స్వామి కల్యాణం డిస్ట్రిక్ట్ టూరిజం
ఆఫీసర్‌గా రమేష్
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): షష్ఠిని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో మంగళవారం శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారి కల్యాణం వైభవంగా జరిగింది. తెల్లవారుజామున అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో ఉత్సవమూర్తులకు పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం రాజగోపురం ఎదుట కళావేదికపై శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి ఉత్సవమూర్తులకు ఆలయ అర్చకులు కల్యాణం జరిపించారు. మేళతాళాలు, మంగళవాయిద్యాలు, వేద మంత్రోచ్ఛారణ మధ్య స్వామివారి కల్యాణం జరిగింది. అనంతరం కల్యాణ తలంబ్రాలను భక్తులకు పంపిణీ చేశారు. కల్యాణోత్సవంలో ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ పాల్గొన్నారు. అనంతరం కల్యాణ వేదిక నుంచి ఉత్సవమూర్తులను ఊరేగింపుగా స్వామివారి ఆలయానికి తీసుకెళ్లారు.
మధురానగర్(విజయవాడసెంట్రల్): ఉమ్మడి కృష్ణా జిల్లా టూరిజం డిస్ట్రిక్ట్ ఆఫీసర్ (అదనపు బాధ్యతలు)గా డాక్టర్ కొల్లేటి రమేష్‌ని నియమిస్తూ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. మాచవరం ఎస్‌ఆర్‌ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రాజనీతి శాస్త్ర అధ్యాపకుడు, జిల్లా ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్ కొల్లేటి రమేష్‌కు డిస్ట్రిక్ట్ టూరిజం ఆఫీషర్‌గా అదనపు బాధ్యతలు కేటాయించారు.