వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో) నిర్వహించే జూన్ –2026 టర్మ్ ఎండ్ పరీక్షలు జూన్ ఒకటి నుంచి జూలై 21వ తేదీ వరకు జరుగుతాయని ఇగ్నో విజయవాడ ప్రాంతీయకేంద్రం రీజినల్ డైరెక్టర్ డాక్టర్ కె.సుమలత శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. విజయవాడ ప్రాంతీయ కేంద్రం పరిధిలో ఆరు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఇవి విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కర్నూల్, అనంతపురంలో ఉంటాయని వివరించారు. అర్హులైన అభ్యర్థులు అందరికీ హాల్ టికెట్లను ఇగ్నో వెబ్ సైట్‌లో ఇప్పటికే అందుబాటులో ఉంచామని వెల్లడించారు. అభ్యర్థులు హాల్ టికెట్లనుని ఇగ్నో విశ్వవిద్యాలయపు సమర్త్ స్టూడెంట్ పోర్టల్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించారు. ప్రాక్టికల్ పరీక్షలకు సంబంధించి అభ్యర్థులు తమ అధ్యయన కేంద్రాలను థియరీ పరీక్షల అనంతరం సంప్రదించాలని పేర్కొన్నారు. ఇతర వివరాలకు విజయవాడ కొత్తపేటలోని హిందూ హై స్కూల్ ప్రాంగణంలోని ఇగ్నో ప్రాంతీయ కేంద్రాన్ని స్వయంగా లేదా 0866–2565253 ఫోన్ నంబర్ ద్వారా సంప్రదించొచ్చని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
ఫొటో జర్నలిస్ట్ శ్రీనివాసరెడ్డికి అంతర్జాతీయ గుర్తింపు
May 30 2026 8:35 AM | Updated on May 30 2026 8:35 AM
ఫొటో జర్నలిస్ట్ శ్రీనివాసరెడ్డికి అంతర్జాతీయ గుర్తింపు గాంధీనగర్(విజయవాడసెంట్రల్): విజయవాడకు చెందిన ఫొటో జర్నలిస్ట్, డాక్యుమెంటరీ ఫొటోగ్రాఫర్ తమ్మా శ్రీనివాసరెడ్డి (టి.ఎస్.రెడ్డి) ప్రతిష్టాత్మక మాస్టర్ ఆఫ్ ది ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫిక్ సొసైటీ(ఎంఏపీఎస్) గౌరవాన్ని అందుకున్నారు. ‘రిస్క్ యాజ్ జాబ్: ది డైలీ సాగా ఆఫ్ ఆర్టిసనల్ కోల్ మైనర్స్’ శీర్షికతో ఆయన రూపొందించిన అద్భుత డాక్యుమెంటరీ పోర్ట్‌ఫోలియోకు ఈ గుర్తింపు లభించింది. ఈ డాక్యుమెంటరీకి ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫిక్ సొసైటీ ప్యానెల్ చాలెంజ్ సిస్టమ్ ద్వారా అంత ర్జాతీయ పురస్కారం ప్రదానం చేసింది. ఈ శక్తివంతమైన డాక్యుమెంటరీ సింగరేణి భూగర్భ బొగ్గు గనుల్లో పనిచేస్తున్న కార్మికుల కఠోర వాస్తవాలు, ప్రమాదాలు, ఓర్పు, దృఢత్వాన్ని చిత్రీకరించింది. ఫొటోగ్రఫీలో తనకు మద్దతిచ్చిన తల్లి సీతమ్మ, భార్య హిమబిందుకు ఈ పురస్కారాన్ని అంకితమిస్తున్నట్లు శ్రీనివాసరెడ్డి ప్రకటించారు.
ఎన్టీఆర్ జిల్లాలో 24.70 మి.మీ. వర్షపాతం గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో గురువారం రాత్రి 24.70 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. జి.కొండూరు మండలంలో అత్యధి కంగా 52.4 మిల్లీమీటర్ల వర్షం పడింది. మండలాల వారీగా ఇబ్రహీంపట్నంలో 46.4, విజయ వాడ సెంట్రల్, వెస్ట్‌లో 41.4, నార్త్‌లో 41.2, ఈస్ట్‌లో 40.8, విజయవాడ రూరల్‌లో 36.2, ఎ.కొండూరులో 32.4, పెనుగంచిప్రోలులో 31.8, వత్సవాయిలో 30.6, తిరువూరులో 27.6, మైలవరంలో 15.4, చందర్లపాడులో 13.4, వీరులపాడులో 13.2, గంపలగూడెంలో 8.4, విస్సన్నపేటలో 7.6, నందిగామలో 6.4, కంచికచర్లలో 4.0, రెడ్డిగూడెంలో 3.4 మిల్లీ మీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.
ముగిసిన చదరంగం
ఉచిత శిక్షణ శిబిరం మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ఆల్ ఇండియా, ఆంధ్రా, ఎన్టీఆర్ జిల్లా చెస్ అసోసియేషన్లు సంయుక్తంగా ఈ నెల 25న గుణదలలోని నెక్ట్స్‌జెన్ సీబీఎస్‌ఈ స్కూల్ ఆవరణలో ప్రారంభించిన ఉచిత చదరంగం శిక్షణ శిబిరం శుక్రవారం ముగిసింది. వివిధ ప్రాంతాల నుంచి 160 మంది క్రీడాకారులు ఈ శిబిరంలో పాల్గొన్నారు. వారికి హరియాణా నుంచి గ్రాండ్ మాస్టర్ హిమాన్షు శర్మను తీసుకొచ్చి శిక్షణ ఇప్పించారు. శిక్షణలో పాల్గొన్న వారదరికీ ప్రశంసా పత్రాలు, మెడల్స్ అందజే శారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రా చెస్ అసోసియేషన్ చైర్మన్ కె.వి.వి.శర్మ, కమిటీ కన్వీనర్ రవీంద్రరాజు, ఎన్టీఆర్ జిల్లా చెస్ అసోసియేషన్ సెక్రటరీ పి.రేణుక, నెక్ట్స్ జెన్ స్కూల్స్ డైరెక్టర్ వీరమాచినేని వంశీ, ప్రిన్సిపాల్ ఎం.సుధ తదితరులు పాల్గొన్నారు.
ఒకటో తేదీ నుంచి ఇగ్నో పరీక్షలు ప్రారంభం
Advertisement


