చిలకలపూడి(మచిలీపట్నం): తెలుగు సాహిత్యానికి అపారమైన సేవలు అందించిన మహాకవి, పండితుడు పుట్టపర్తి నారాయణాచార్యులు తెలుగుభాషా వైభవాన్ని చాటిచెప్పిన మహనీయుడని కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. పుట్టపర్తి నారాయణాచార్యులు జయంతి సందర్భంగా కలెక్టరేట్‌లోని సమావేశపు హాలులో శనివారం ఆయన చిత్రపటానికి కలెక్టర్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ నారాయణాచార్యులు తెలుగుభాషా సాహిత్య జగత్తులో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. యువత ఆయన సాహిత్య వారసత్వాన్ని అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో డీఆర్వో కె.చంద్రశేఖరరావు, ట్రైనీ డెప్యూటీ కలెక్టర్ నిఖిల, కలెక్టరేట్ ఏవో ఏఎస్‌ఎన్ రాధిక, సిబ్బంది పాల్గొన్నారు.
కలెక్టర్ బాలాజీ


