టెన్త్‌ పరీక్షలకు 305 మంది గైర్హాజరు | - | Sakshi
Sakshi News home page

టెన్త్‌ పరీక్షలకు 305 మంది గైర్హాజరు

Mar 26 2026 11:41 AM | Updated on Mar 26 2026 11:41 AM

టెన్త్‌ పరీక్షలకు 305 మంది గైర్హాజరు

మచిలీపట్నం అర్బన్‌: జిల్లాలో పదో తరగతి పరీక్షలు బుధవారం ప్రశాంతంగా జరిగాయని సమగ్ర శిక్ష అడిషనల్‌ స్టేట్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌, జిల్లా అబ్జర్వర్‌ డాక్టర్‌ ఎం.ఆర్‌. ప్రసన్న కుమార్‌ తెలిపారు. పరీక్షల పర్యవేక్షణలో భాగంగా జిల్లా విద్యాశాఖాధికారి యు.వి.సుబ్బారావు జిల్లాలోని ఆరు పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. జిల్లా మానిటరింగ్‌ కోఆర్డినేటర్‌ తొమ్మిది పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. ఏడు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారులు 42 కేంద్రాలను, ఏసీజీఈ కష్ణా, మచిలీపట్నం అధికారులు పది కేంద్రాలను సందర్శించారు. బుధవారం జరిగిన భౌతిక శాస్త్రం పరీక్షకు 21,716 మంది విద్యార్థులకు 21,411 మంది పరీక్షకు హాజరవగా, 305 మంది గైర్హాజరయ్యారు. హాజరు 98.60 శాతంగా నమోదైంది. డీఈఓ యు.వి. సుబ్బారావు పామర్రు జెడ్పీ, అస్సీసి హై స్కూల్‌, ఉయ్యూరు జెడ్పీ, వీఆర్‌కేఎం, ఫ్లోరా హై స్కూల్‌లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. ఓపెన్‌ టెన్త్‌కు సంబంధించి సాంఘిక శాస్త్రం పరీక్షకు 590 మంది విద్యార్థులకు 414 మంది హాజరయ్యారు. 176 మంది గైర్హాజరయ్యారు. హాజరు 70.17 శాతంగా నమోదైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement