కృష్ణాజిల్లా
న్యూస్‌రీల్
ఆంక్షల చట్రాన్ని ఛేదిస్తూ..
చంద్రబాబుకు బీసీలంటే చులకన..
మహిళా నాయకుల ఆత్మీయ స్వాగతం..
పులిచింతల సమాచారం
కళాత్మకమైన కలంకారి
అన్నదానానికి విరాళాలు
శనివారం శ్రీ 7 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
u8లో
● అధికారుల అవినీతిపై చర్యలకు జీవో
● బహుళ అంతస్తుల భవనాలను
రేకుల షెడ్లుగా చూపి పన్నుల విధింపు
● ఏసీబీ విచారణలో నిర్ధారణ
జన కెరటం.. ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ వద్ద వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని చూసేందుకు తరలివచ్చిన అశేష జనవాహినిలో ఓ భాగం, (ఇన్‌సెట్‌లో)అభివాదం చేస్తున్న వైఎస్ జగన్
లబ్బీపేట(విజయవాడతూర్పు): మెడికల్ పోస్టు గ్రాడ్యుయేషన్ విద్యార్థిని డాక్టర్ బత్తుల దీపిక ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ వైద్య విద్యార్థులు శుక్రవారం రాత్రి కొవ్వొ త్తులతో ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ సిద్ధా ర్థ వైద్య కళాశాల నుంచి జీజీహెచ్ వరకూ నిర్వహించిన ర్యాలీలో వైద్య విద్యార్థులు, టీ చింగ్ వైద్యులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని డాక్టర్ దీపికకు ఘన నివాళులు అర్పించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఏడుకొండలరావు మాట్లాడుతూ దీపిక పీజీ విద్యార్థినిగా వైద్య రంగానికి అందించిన సేవలు ఎప్పటికీ స్మరణీయమన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): అక్షరాంధ్ర కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని నిరక్ష్యరాస్యులు అక్షరాస్యులుగా మారి.. బంగారు భవితకు బాటలు వేసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా విజయవాడ అర్బన్ పరిధిలోని రామలింగేశ్వరనగర్‌లో నిర్వహిస్తున్న అక్షరాంధ్ర కేంద్రాన్ని కలెక్టర్ శుక్రవారం పరిశీలించారు. అక్షర జ్ఞానాన్ని పొందుతున్న మహిళలతో మాట్లాడి, వారి అభ్యసన సామర్థ్యాన్ని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమానికి హాజరైన మహిళలతో ముచ్చటించి, బోధనా పద్ధతులను పరిశీలించారు. వలంటీర్లు అందిస్తున్న శిక్షణపై సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో వయోజనులైన దాదాపు 96 వేల మంది నిరక్షరాస్యులను గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా గుర్తించామని, వీరందరినీ అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తున్నట్లు తెలిపారు. విజయవాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ డి.చంద్రశేఖర్ పాల్గొన్నారు.
లబ్బీపేట(విజయవాడతూర్పు): అన్ని జిల్లాల్లోని ఎస్సీ, ఎస్టీ వినియోగదారులకు సోలార్ రూఫ్ టాప్స్ ఏర్పాటు, పీఎం సూర్యఘర్‌పై ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పి. పుల్లారెడ్డి శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. సూర్యారావుపేటలోని ఆ సంస్థ సర్కిల్ కార్యాలయంలో నిర్వహించిన ఈ సమీక్షలో అన్ని జిల్లాల ఎస్‌ఈలు, ఈఈలు పాల్గొని, ఫీడర్ లెవల్ సోలరైజేషన్‌పై సమీక్షించారు. ఈ సందర్భంగా పుల్లారెడ్డి మాట్లాడుతూ వినియోగదారులకు త్వరితగతిన సర్వీసు ఇవ్వాలని, రెవెన్యూ కలెక్షన్స్ నూరు శాతం సాధించాలని సూచించారు. లో ఓల్టేజ్ సమస్య పరిష్కరించాలని, ఫీడర్స్ అన్నీ బ్రేక్‌డౌన్ కాకుండా నిరంతరంగా పర్యవేక్షించాలని ఆదేశించారు. సమావేశంలో టెక్నికల్ డైరెక్టర్ మురళీ కృష్ణ యాదవ్, ప్రాజెక్ట్స్ డైరెక్టర్ టీవిఎస్‌ఎన్ మూర్తి, ఫైనాన్స్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు, సీజీఎంలు, జీఎంలు పాల్గొన్నారు.
జి.కొండూరు: సర్కారు ఆంక్షలు.. అభిమానాన్ని అడ్డుకోలేకపోయాయి. తమ అభిమాన నేతను కళ్లారా చూసేందుకు వచ్చిన వేలాది మంది జనంతో విజయవాడ వెస్ట్ బైపాస్, నల్లకుంట జంక్షన్ కిక్కిరిసిపోయింది. ఇటీవల టీడీపీ గూండాలు పెట్రోలు బాంబులు, యాసిడ్ బాటిళ్లతో దాడి చేసి తగలబెట్టిన జోగి రమేష్ నివాసాన్ని మాజీ సీఎం, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం పరిశీలించి, కుటుంబాన్ని పరామర్శించారు. విజయవాడ వెస్ట్ బైపాస్ నల్ల కుంట జంక్షన్‌కు మధ్యాహ్నం 1.40గంటలకు చేరిన వైఎస్ జగన్ అక్కడి నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న జోగి రమేష్ నివాసానికి చేరుకోవడానికి 3.25 గంటలు సమయం పట్టిందంటే అభిమానులు ఆయనకు ఏ విధంగా స్వాగతం పలికారో అర్థమవుతుంది.
గుంటూరు జిల్లా తాడేపల్లి నుంచి బయలుదేరిన వైఎస్ జగన్ విజయవాడ వెస్ట్ బైపాస్ నల్లకుంట జంక్షన్ వద్దకు మధ్యాహ్నం 1.40కి చేరుకున్నారు. అక్కడికి ఉదయం 9గంటలకే వేలాదిగా చేరుకున్న అభిమానులు వైఎస్ జగన్‌కు ఘన స్వాగతం పలికారు. విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఇండస్ట్రీయల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండి పుణ్యశీల ఆధ్వర్యంలో మహిళా నాయకులు వైఎస్ జగన్‌కు గుమ్మడికాయలతో దిష్టి తీసి స్వాగతం పలికారు. వెస్ట్ బైపాస్ ఫ్లై ఓవర్‌పై నుంచి ఆయనపై పూల వర్షం కురిపించారు.
వైఎస్ జగన్ ఇబ్రహీంపట్నం పర్యటనకు ప్రభుత్వం ఆదేశాలతో పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లి నుంచి కృష్ణానది వారధి మీదుగా విజయవాడ చేరుకొని కనకదుర్గ ఫ్లై ఓవర్ మీదుగా ఇబ్రహీంపట్నం వెళ్తారని ముందుగానే తెలియజేసినా పోలీసులు అనుమతించలేదు. నగరంలో ట్రాఫిక్ సమస్యను సాకుగా చూపుతూ రూట్ మ్యాప్ మార్చుకోవాలని నోటీసు ఇచ్చారు. దీనితో గుంటూరు జిల్లా తాడేపల్లి నుంచి బయలుదేరిన వైఎస్ జగన్ మంగళగిరి బైపాస్, కాజా నుంచి వెస్ట్ బైపాస్ మీదుగా నల్లకుంట చేరి అక్కడి నుంచి ఇబ్రహీంపట్నం చేరుకున్నారు. అదేవిధంగా ర్యాలీగా వెళ్లొద్దంటూ నియోజకవర్గ ఇన్‌చార్జులు, ముఖ్య నేతలకు గురువారం రాత్రే నోటీసులు ఇచ్చారు. ముఖ్యంగా తిరువూరు, జగ్గయ్యపేట, నందిగామ, విజయవాడ ఈస్ట్, వెస్ట్, సెంట్రల్ నియోజకవర్గాల వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జులు నల్లగట్ల స్వామిదాసు, తన్నీరు నాగేశ్వరరావు, మొండితోక జగన్‌మోహన్‌రావు, దేవినేని అవినాష్, వెల్లంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణుకు పోలీసులు నోటీసులు అందించారు. నల్లగట్ల స్వామిదాసును తిరువూరులోని ఆయన నివాసంలో అడ్డుకోవడంతో పాటు మైలవరం మండలంలోని బాడవ టోల్‌ప్లాజా, మైలవరం లక్కిరెడ్డి బాలిరెడ్డి కళాశాల వద్ద అడ్డుకున్నారు. కంచికచర్ల మండలం కీసర టోల్‌ప్లాజా, బాడవ టోల్ ప్లాజా, రెడ్డిగూడెం మండలం నాగులూరు, జి.కొండూరు వై జంక్షన్, కట్టుబడిపాలెం జంక్షన్‌ల వద్ద ఉదయం నుంచి పోలీసులు పహారా కాస్తూ వైఎస్సార్ సీపీ శ్రేణులను అడ్డుకున్నారు. అయినప్పటికీ భారీగా తరలి వచ్చిన వైఎస్సార్ సీపీ శ్రేణులు, వైఎస్ జగన్ అభిమానులు ఆయనకు బ్రహ్మరథం పట్టారు.
జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. చంద్రబాబుకు బీసీలంటే చులకన కాబట్టే బీసీ నాయకుడిగా ఎదుగుతున్న జోగి రమేష్‌ను అణగదొక్కేందుకు చంద్రబాబు అనేక కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. తంబళ్లపల్లిలో నకిలీ లిక్కర్ కంపెనీని స్థాపించిన జయచంద్రారెడ్డిపై చర్యలు తీసుకోకుండా జోగి రమేష్‌పై కేసు పెట్టడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబు దారుణ పాలనలో జోగి రమేష్ నకిలీ మద్యం ఎలా తయారు చేయగలుగుతాడో చెప్పాలన్నారు. జోగి రమేష్‌పై 12 అక్ర మ కేసులు పెట్టి 83రోజులు జైలులో ఉంచింది కాక రాజకీయంగా ఎదుగుతున్నాడని ఆయన కుమారుడు జోగి రాజీవ్‌పై 7కేసులు పెట్టారని మండిపడ్డారు. చివరకు భర్తను చూడటానికి ఆస్పత్రికి వెళ్లిన ఆయన భార్య శకుంతలమ్మ, చిన్న కుమారుడిపై కూడా కేసులు నమోదు చేయడం చూస్తే బీసీలంటే చంద్రబాబుకు ఎంత చులకనో అర్థమవుతుందన్నారు. ఇన్ని కేసులు పెట్టి ఇంత వేధించినా తట్టుకొని నిలబడడమేంటని గూండాలతో పెట్రోలు బాంబులు, కర్రలు, రాళ్లతో జోగి రమేష్ ఇంటిపై దాడి చేయించి ఇంటిని తగలబెట్టడం దారుణమైన చర్యగా అభివర్ణించారు.
జోగి రమేష్ ఇంట్లో నిప్పు అంటుకున్న ప్రాంతాన్ని పరిశీలిస్తున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, నాయకులు
వీటీపీఎస్ కూలింగ్ కెనాల్ వద్ద బారులు తీరిన జనాలకు అభివాదం చేస్తున్న వైఎస్ జగన్
మామయ్య ఆశీర్వాదం.. ప్రభుత్వ స్కూల్ విద్యార్థినిని దీవిస్తున్న వైఎస్ జగన్
మా బిడ్డొచ్చాడు.. జననేతను చూసి అభివాదం చేస్తున్న వృద్ధ మహిళలు
దాడి వివరాలను జగన్‌కు చెబుతున్న జోగి రమేష్ కుటుంబ సభ్యులు, చిత్రంలో దేవినేని అవినాష్, మల్లాది, మొండితోక, వెలంపల్లి తదితరులు
బందరు కార్పొరేషన్‌లో కలవరం
మచిలీపట్నంటౌన్: మచిలీపట్నం నగరపాలక సంస్థలో గతంలో కమిషనర్‌గా పనిచేసిన ఎస్. శివరామకృష్ణతో పాటు మరో 35 మంది ఉద్యోగులపై చర్యలు తీసుకునేందుకు మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ విభాగం అధికారులు ఇటీవల జీవో 87ను జారీ చేశారు. గతంలో మున్సిపల్ కమిషనర్‌గా పనిచేసిన ఎస్. శివరామకృష్ణతో పాటు రెవెన్యూ, ఇంజినీరింగ్ తదితర విభాగాల్లో వివిధ హోదాల్లో పని చేసిన 35 మంది ఉద్యోగులు చేసిన అవినీతిపై త్వరలో చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు. ఈ మేరకు ఈ శాఖ అధికారులు ఈనెల 6వ తేదీన ఈ జీవోను జారీ చేశారు.
పూర్తి వివరాలు ఇవి..
నగరపాలక సంస్థ పరిధిలో 2021 మే, జూన్ నెలల ప్రాంతంలో జరిగిన అవినీతిపై ఏసీబీ అధికారులు విచారణ నిర్వహించారు. ఈ విచారణలో కార్పొరేషన్ పరిధిలో తీవ్రమైన అక్రమాలు, అవినీతి కార్యకలాపాలు జరిగినట్టు నిర్ధారించారు. లంచాలు తీసుకుని బహుళ అంతస్తుల భవనాలను రేకుల షెడ్లుగా చూపి తక్కువ పన్నులు వేయటం, తాగునీటి కనెక్షన్ల కోసం, నీటి బిల్లుల జారీ కోసం పెద్ద ఎత్తున లంచాలు వసూలు చేయటం వంటి చర్యలను నిర్ధారించిన ఏసీబీ డైరెక్టర్ జనరల్ 2024 డిసెంబర్ 31న ఎంఏ అండ్ యూడీ శాఖకి నివేదిక ఇచ్చారు. దీని ప్రకారం నాడు కమిషనర్‌గా పనిచేసిన ఎస్. శివరామకృష్ణ తోపాటు 35 మంది ఉద్యోగులు ఈ అవినీతిలో పాలుపంచుకున్నట్లు తేలింది. కమిషనర్ శివరామకృష్ణతో పాటు నాడు టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్‌లుగా పని చేసిన గుగులోతు కృష్ణ, కుమ్మరి శ్రీహరి ప్రసాద్, అనుమకొండ శ్రీధర్, కోన ఆశ, కె. వీరబ్రహ్మం, ఆర్‌ఐలు బొర్రా వెంకట కల్యాణ్, చీలి మోహన్ గోపాల్, వేదకొప్పుల వినయ్ రాజేంద్రప్రసాద్‌లతో పాటు టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, ఇంజినీరింగ్ విభాగాల్లోని ఉద్యోగులతో పాటు సచివాలయ కార్యదర్శులు ఈ అవినీతికి పాల్పడినట్లు నిర్ధారించారు. వీరిపై మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ అధికారులు త్వరలో శాఖా పరమైన విచారణ చేపట్టి బాధ్యులైన నాటి కమిషనర్ శివరామకృష్ణతో పాటు మరో 35 మంది ఉద్యోగులపై శాఖపరమైన చర్యలు తీసుకోనున్నారు. ఈ జీవో విడుదలతో నగరపాలక సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో కలవరం మొదలైంది.
7
వెస్ట్ బైపాస్ ఫ్లై ఓవర్ వద్ద 15 నిముషాల పాటు అభిమానులకు అభివాదం చేసిన వైఎస్ జగన్ 2.09గంటలకు నల్లకుంట గ్రామం సెంటర్‌కు చేరారు. అక్కడి నుంచి సూరాయిపాలెం జంక్షన్, గుంటుపల్లి జంక్షన్, ఖాజీపేట, తుమ్మలపాలెం జంక్షన్, వీటీపీఎస్ కూలింగ్ కెనాల్ వంతెన, బుడమేరు డైవర్షన్ కెనాల్ వంతెన మీదుగా ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్‌కు 4.17కి చేరుకున్నారు. రింగ్‌సెంటర్‌లో భారీగా తరలి వచ్చిన అభిమానులకు అభివాదం చేస్తూ నెమ్మదిగా ముందుకు కదులుతూ 5.05 గంటలకు జోగి రమేష్ నివాసానికి చేరుకున్నారు.
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టు నుంచి దిగువకు 2400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 36.2750 టీఎంసీలు.
పెడనలో కలంకారి పరిశ్రమలను ఒడిశాకు చెందిన కళాకారులు శుక్రవారం పరిశీలించారు. అపూరమైన ఈ కళకు మంచి భవిష్యత్తు ఉందని వారు పేర్కొంటున్నారు.
దుర్గమ్మ సన్నిధిలో నిత్యాన్నదానానికి శుక్రవారం పలువురు భక్తులు విరాళాలు అందజేశారు. దాతలకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందించారు.
కృష్ణాజిల్లా
కృష్ణాజిల్లా
కృష్ణాజిల్లా
కృష్ణాజిల్లా
కృష్ణాజిల్లా
కృష్ణాజిల్లా
కృష్ణాజిల్లా
కృష్ణాజిల్లా
కృష్ణాజిల్లా
కృష్ణాజిల్లా
కృష్ణాజిల్లా
కృష్ణాజిల్లా
కృష్ణాజిల్లా
కృష్ణాజిల్లా
కృష్ణాజిల్లా
కృష్ణాజిల్లా
కృష్ణాజిల్లా
కృష్ణాజిల్లా


