ఇంటర్ యూనివర్సిటీ మహిళా బాల్‌బ్యాడ్మింటన్ జట్టు ఎంపిక
విజయవాడ కల్చరల్: సంస్కార భారతి, సుమధుర కళానికేతన్ ఆధ్వర్యాన భరతముని జయంతి సందర్భంగా నిర్వహించే జాతీయ స్థాయి శాసీ్త్రయ నృత్య పోటీలు శని, ఆదివారాల్లో నిర్వహించనున్నట్లు సంస్కారభారతి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పీవీఎన్ కృష్ణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కౌతా పూర్ణానందం కళావేదిక, అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక సంఘం కోదండ రామాలయం ముత్యాలంపాడు, అయోధ్యనగర్ శివాలయం, హైందవి కార్యాలయంలో పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు. ఆదివారం సింగ్‌నగర్‌లోని వివేకానంద స్కూల్‌లో జరిగే ముగింపు సభలో విజేతలకు బహుమతీ ప్రదానం చేస్తామని పేర్కొన్నారు. మాజీ సైనిక అధికారి సీబీఆర్ స్పోర్ట్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ వ్యవస్థాపకుడు చలసాని బలరామయ్యను సత్కరిస్తున్నట్లు తెలిపారు.
వస్త్రాలయాన్ని ప్రారంభించిన ఆర్‌ఎక్స్ 100 కథానాయిక
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): స్థానిక పీవీపీ మాల్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీవిద్యా వస్త్రాలయాన్ని శుక్రవారం సినీ నటి, ఆర్‌ఎక్స్ 100 ఫేమ్ పాయల్ రాజ్‌పుత్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విజయవాడ రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. షోరూమ్ మేనేజింగ్ డైరెక్టర్ ఓంప్రకాష్ మాట్లాడుతూ తమ షోరూమ్‌లో డిజైనర్ శారీస్, లెహంగాస్, డ్రసెస్స్, కుర్తీస్ సెట్స్ నూతన డిజైన్స్‌లో సరికొత్త స్టాక్‌తో నగర వాసులకు అందుబాటులో ఉంచామన్నారు. ప్రారం భోత్సవం సందర్భంగా అన్ని రకాల వస్త్రాలపై 10 శాతం డిస్కౌంట్ అందిస్తున్నామని చెప్పారు.
మహిళా కమిషన్ చైర్‌పర్సన్
రాయపాటి శైలజ
లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాలలో ఎనస్థీషియా విభాగంలో పోస్టు గ్రాడ్యుయేషన్ చేస్తున్న బత్తుల దీపిక మృతి చెందడం చాలా దురదృష్టకరమని ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె శుక్రవారం ప్రభుత్వాస్పత్రిని సంద ర్శించి ఘటన వివరాలను అధికారులు, తోటి విద్యార్థ్ధినిలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రిన్సిపాల్ డాక్టర్ ఆలపాటి ఏడుకొండలరావుతో కలిసి శైలజ మీడియాతో మాట్లాడారు. మూడేళ్లుగా దీపిక ఇక్కడే చదువుతోందన్నారు. ఆమె ప్రవర్తనలో ఎవైనా మార్పులు ఉన్నాయా, ఏదైనా ఒత్తిడి ఉందా అనే కోణంలో తోటి విద్యార్థులు, సహచర వైద్యులతో మాట్లాడినట్లు తెలిపారు. డాక్టర్ దీపిక చాలా ప్రతిభావంతురాలని, ఆమె ప్రవర్తనలో ఎలాంటి అసాధారణ మార్పులు లేవని చెప్పారన్నారు. మృతదేహంపై ఉన్న పోస్టుమార్టం రిపోర్టు వచ్చేందుకు రెండు, మూడు వారాలు పడుతుందని, అప్పుడు మృతికి కారణం తెలుస్తుందని ఆమె తెలిపారు. కేసు దర్యాప్తు అనేక కోణాల్లో జరుగుతున్నట్లు పేర్కొన్నారు.
ఇంటర్ యూనివర్సిటీ మహిళా బాల్‌బ్యాడ్మింటన్ జట్టు ఎంపిక


