కళాత్మకమైన కలంకారి
కలంకారి పరిశ్రమలను పరిశీలించిన ఒడిశా కళాకారులు, తిరుపతి విద్యార్థులు
పెడన: పెడనలో కలంకారి పరిశ్రమలను ఒడిశాకు చెందిన కళాకారులు శుక్రవారం పరిశీలించారు. మార్కెట్‌లో ప్రస్తుతం కళాత్మకమై కలంకారి ట్రెండ్ నడుస్తోందని, అపూరమైన ఈ కళకు మంచి భవిష్యత్ ఉందని వారు పేర్కొంటున్నారు. ఒడిశాలోని జబస్తాన్‌పురి శ్రీపార్వతీ వీవర్స్ కో ఆపరేటివ్ సొసైటీకి చెందిన 20 మంది చేనేత కళాకారులు పెడనలోని పలు కలంకారి పరిశ్రమలను, చేనేత కళలను పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వ వీవర్స్ సర్వీస్ సెంటర్ సౌజన్యంతో వీరు పెడనలోని స్థానిక బ్రహ్మపురం సదాశివ లింగేశ్వర సొసైటీలో చేనేత వస్త్రాలను పరిశీలించారు. సూపర్‌వైజర్ విజయసింగ్, సంశలిత తదితరులు వీరికి మార్గదర్శకం చేశారు.
తిరుపతి విద్యార్థులు సైతం..
తిరుపతి అలిపిరిలోని శ్రీవెంకటేశ్వర శిల్ప కళాశాల విద్యార్థులు కూడా శుక్రవారం కలంకారి కళపై అధ్యయనం చేయడానికి పెడనలో పర్యటించారు. వీరు జాతీయ హస్తకళల అవార్డు గ్రహీతలు కొండ్రు గంగాధర్, నరసయ్య బ్రదర్స్‌ను మర్యాదపూర్వకంగా కలిసి బ్లాక్స్ తయారీపై వివరాలను అడిగి తెలుసుకున్నారు.


