చంద్రబాబు ప్రభుత్వంలో ఆదరణ సున్నా
ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వంలో పరిశ్రమలకు ఆదరణ కనిపించడం లేదు. ఎంఎస్‌ఎంఈలపై నూతన ఐదేళ్ల పాలసీ ప్రకటించిన ప్రభుత్వం ఇప్పటికే నెలకొల్పిన పరిశ్రమలపై ఎటువంటి కార్యాచరణ ప్రకటించలేదు. కేవలం నూతన పాలసీని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే ఉన్న పరిశ్రమలకు ఎటువంటి ప్రోత్సాహక ప్రణాళిక వెల్లడించలేదు. దీంతో తీసుకున్న రుణాలు చెల్లించలేక, సరుకు ఉత్పత్తికి తగిన డిమాండ్ మార్కెట్‌లో లేక పరిశ్రమ నడపాలా వద్దా అనే పునరాలోచనలో పారిశ్రామికవేత్తలు పడ్డారు. ప్రభుత్వం పాత పారిశ్రామిక వాడలకు ప్రోత్సాహం ఇవ్వదని తేటతెల్లం కావడంతో పరిశ్రమలను మూసివేసుకుంటున్నారు. ఇప్పటికై నా చంద్రబాబు ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటించాలని పారిశ్రామిక వేత్తలు కోరుతున్నారు.


