కృష్ణాజిల్లా
న్యూస్‌రీల్
నత్తనడకన మరమ్మతులు
పురోగతిలో మరమ్మతులు
పులిచింతల ప్రాజెక్టు సమాచారం
రంగుల మండపం వద్ద సందడి
ఉత్కంఠగా కబడ్డీ పోటీలు
గురువారం శ్రీ 22 శ్రీ జనవరి శ్రీ 2026
u8లో
రివర్ ఫ్రంట్ పార్కు..
● 2024 సెప్టెంబర్‌లో కృష్ణా నది వరదలకు దెబ్బతిన్న పార్కు
● 15 నెలలకు పైగా గడిచినా
ఇప్పటికీ పూర్తిగాని మరమ్మతులు
● గత ప్రభుత్వ హయాంలో
1.25 కి.మీ. మేర పార్కు నిర్మాణం
● రూ.12.3 కోట్ల్లు ఖర్చుచేసి
సకల హంగులు కల్పించిన వైనం
● ప్రస్తుతం పార్కు అభివృద్ధి,
మరమ్మతులను విస్మరించిన ప్రభుత్వం
చిలకలపూడి(మచిలీపట్నం): ఉమ్మడి కృష్ణా జిల్లా పరిషత్ సవరణ బడ్జెట్ అంచనాలు 2025 – 26, 2026 – 27 సంవత్సరపు బడ్జెట్ అంచనాల ఆమోదం నిమిత్తం గురువారం సర్వసభ్య సమావేశం జరుగుతుందని జెడ్పీ సీఈఓ కె.కన్నమనాయుడు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశపు హాలులో మధ్యాహ్నం 2.30 గంటలకు చైర్‌పర్సన్ ఉప్పాల హారిక అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుందని పేర్కొన్నారు. జిల్లా పరిషత్ సభ్యులు, శాశ్వత, ప్రత్యేక ఆహ్వానితులు, ఉమ్మడి కృష్ణాజిల్లా అధికారులందరూ తప్పనిసరిగా హాజరుకావాలని కోరారు.
స్థాయీ సంఘ సమావేశాలు
జిల్లా పరిషత్ స్థాయీ సంఘ సమావేశాలు గురువారం నిర్వహించనున్నట్లు సీఈఓ కన్నమనాయుడు తెలిపారు. ఉదయం 10.30 గంటల నుంచి ఈ సమావేశాలు చైర్‌పర్సన్ ఉప్పాల హారిక, ఆయా సంఘాల అధ్యక్షుల ఆధ్వర్యంలో జరుగుతాయని వివరించారు. ఆయా స్థాయీ సంఘాల సభ్యులు, అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని కోరారు.
భవానీపురం(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై వేంచేసిన శ్రీదుర్గామల్లేశ్వరస్వామివార్ల దేవస్థానంలో ఈ నెల 23వ తేదీన పంచమి సందర్భంగా కనకదుర్గ అమ్మవారు శ్రీసరస్వతీ దేవి అలంకారంగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఆ రోజు సామూహిక అక్షరాభ్యాసాలు జరగనున్నాయి. ఈ కార్యక్రమాలపై వైదిక కమిటీ సమావేశం బుధవారం మహామండపం నాలుగో అంతస్తులోని ఆలయ ఈఓ కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో వసంత పంచమి పర్వదినాన లోకకల్యాణార్థం నిర్వహించే సరస్వతి యాగం, ఇతర కార్యక్రమాలపై చర్చించారు. ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధి), ఈఓ వి.కె.శీనానాయక్ సమక్షంలో జరిగిన ఈ సమావేశంలో స్థానాచార్య వి.శివ ప్రసాద్ శర్మ, ప్రధాన అర్చకుడు ఎల్.దుర్గా ప్రసాద్, దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి సీహెచ్ శ్రీనివాస్ శర్మ, వైదిక కమిటీ సభ్యులు వి.ఎస్.మహర్షి, సీహెచ్. ఆంజనేయ ఘనాపాటి, వి. శ్రీధర్ శర్మ, ఉప ప్రధాన అర్చకుడు బి.శంకరశాండిల్య, ముఖ్యఅర్చకుడు ఆర్.శ్రీనివాసశాస్త్రి తదితరులు పాల్గొన్నారు.
సాక్షి ప్రతినిధి, విజయవాడ: కృష్ణా నది ఒడ్డున నిర్మించిన రివర్ ఫ్రంట్ పార్కుపై ప్రభుత్వం చిన్న చూపు చూస్తోంది. కృష్ణా నది చెంతన విజయవాడ నగర ప్రజలకు ఆహ్లాదం పంచిన పార్కు ఇప్పుడు పచ్చదనం కోల్పోయి, పరిసరాలు ధ్వంసమై కళావిహీనంగా మారింది. నగరానికే ఐకానిక్‌గా నిలిచిన ఈ పార్కు నిర్వహణను ప్రభుత్వం గాలికి వదిలేసింది. 2024 సెప్టెంబర్‌లో కృష్ణా నదికి వచ్చిన భారీ వరదలకు డ్రెయిన్లు ఉప్పొంగాయి. కృష్ణలంక ప్రాంతం ముంపునకు గురికాకుండా డ్రెయిన్లలో నీటిని మోటార్లతో బయటికు తోడే సమయంలో పార్కు కోతకు గురైంది. వాకింగ్ ట్రాక్ దెబ్బతింది. ఈ నేపథ్యంలో పార్కుకు మరమ్మతులు చేసి, అందు బాటులోకి తీసుకురాకుండా ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. పార్కులో చేపట్టిన మరమ్మతులు నత్తనడకన సాగుతున్నాయి. ఫలితంగా 15 నెలలుగా పార్కు మూత పడే ఉంది. ఇప్పుడిప్పుడే ఉదయం సమయంలో ఐదు నుంచి తొమ్మిది గంటల వరకు కేవలం వాకర్లను మాత్రమే పార్కు లోకి అనుమతిస్తున్నారు. ఇప్పటికీ పూర్తిస్థాయిలో పార్కు గేట్లు తెరుచుకోవటం లేదు. గత ప్రభుత్వ హయాంలో పార్కును ఉదయం, సాయంత్రం సమయాల్లో తెరిచేవారు. పార్కును సకల హంగులతో తీర్చిదిద్దటంతో నగర వాసులు సాయంత్రం వేళ సకుటుంబ సమేతంగా పార్కుకు వచ్చి ఆహ్లాదంగా గడుపుతూ సేద తీరేవారు. ఇప్పుడు ఆ మధురానుభూతులను నగరవాసులు తలుచుకుంటున్నారు. పార్కు ఎప్పుడు అందుబాటులోకి వస్తుందా అని ఎదురు చూస్తున్నారు.
కృష్ణా నది రిటైనింగ్ వాల్ వెంబడి 3.3 కిలోమీటర్ల పొడవున పార్కు నిర్మాణం కోసం రూ.17 కోట్లతో గత ప్రభుత్వ హయాంలో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మొదటి దశలో కనకదుర్గ వారధి వద్ద నుంచి పోలీస్ కాలనీ డీపీ స్టేషన్ వరకు 1.25 కిలోమీటర్ల పొడవున నది ఒడ్డున పార్కును అభివృద్ధి చేశారు. దీని కోసం రూ.12.3 కోట్లు ఖర్చు చేశారు. గత ప్రభుత్వ హయాంలోనే రూ.400 కోట్లతో కృష్ణా నది వెంబడి నిర్మించిన రక్షణ గోడతోపాటు రూ.12.3 కోట్లతో అభివృద్ధి చేసిన పార్కును 2024 మార్చిలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. అప్పటి నుంచి పార్కు నగర ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. పార్కు అందాలను ప్రజలు ఆస్వాదించారు. 2024 సెప్టెంబర్‌లో కృష్ణా నదికి వచ్చిన భారీ వరదతో పార్కు కోతకు గురైంది. అప్పటి నుంచి కూటమి ప్రభుత్వం పార్కును పట్టించుకోలేదు. కొంత మేర అసంపూర్తిగా ఉన్న పనులును పూర్తి చేయలేదు. రెండో దశ పనుల ఊసేలేదు. రకరకాల మొక్కలతో కనువిందు చేసిన ఈ పార్కు ఇప్పుడు పచ్చదనం కోల్పోయి కళా విహీనంగా తయారైంది. ఇప్పటి కైనా ప్రభుత్వ పెద్దలు దృష్టి సారించి పార్కులో అసంపూర్తిగా ఉన్న పనులను చేపట్టడంతోపాటు మరమ్మతులను పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలని నగర వాసులు కోరుతున్నారు.
7
రివర్ ఫ్రంట్ పార్కుకు మరమ్మతులు చేస్తున్నాం. పార్కులో మిగిలిన పనులు కూడా జరుగుతున్నాయి. పార్కులో ప్రస్తుతం రూ.కోటితో చేపట్టిన పనులు పురోగతిలో ఉన్నాయి. గత నెలలో వాకింగ్ ట్రాక్ పనులు పూర్తి చేశాం. టాయిలెట్ నిర్మాణం పనులు పూర్తి చేశాం. 60 రోజులకు అన్ని పనులు పూర్తయ్యేలా ప్రణాళిక రచించాం. రూ.25 లక్షలతో ప్రొటెక్షన్ బండ్ పనులు జరుగుతున్నాయి. ఆ పనులకు కొంత అదనంగా సమయం పట్టే అవకాశం ఉంది. రెండో దశ పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం.
– ప్రభాకర్‌రావు,
ఈఈ, విజయవాడ నగరపాలక సంస్థ
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టు నుంచి దిగువకు 2900 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నీటి నిల్వ 37.7277 టీఎంసీలు.
జగ్గయ్యపేట పట్టణంలోని రంగుల మండపం వద్ద భక్తుల సందడి నెలకొంది. తిరుపతమ్మ, గోపయ్య స్వామిని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు.
గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో జాతీయ కబడ్డీ పోటీలు ఉత్కంఠభరితంగా సాగాయి. తొలి పోటీలో ఆంధ్రప్రదేశ్‌పై పంజాబ్ జట్టు విజయం సాధించింది.
కృష్ణాజిల్లా
కృష్ణాజిల్లా
కృష్ణాజిల్లా
కృష్ణాజిల్లా
కృష్ణాజిల్లా
కృష్ణాజిల్లా
కృష్ణాజిల్లా


