పార్కు కళావిహీనం
గత ప్రభుత్వం కృష్ణా నది తీరాన రిటైనింగ్‌వాల్ వెంబడి నిర్మించిన రివర్ ఫ్రంట్ పార్క్ నేడు కళావిహీనంగా మారింది. గత ప్రభుత్వ హయాంలో నిత్యం ఉదయం, సాయంత్రం వేళల్లో సందర్శకులు, వాకర్లతో కళకళలాడేది. కుటుంబ సభ్యులతో ఆహ్లాదంగా గడిపేవాళ్లం. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. కొన్ని రోజుల నుంచి ఉదయం వేళ వాకర్లను మాత్రమే పార్కులోకి అనుమతిస్తున్నారు. సాయంత్రం వేళ పార్కులోకి ఎవరినీ అనుమతించడం లేదు. ఆహ్లాదం కోసం నిర్మించిన పార్కును ఉదయం, సాయంత్రం తెరిచి సందర్శకులను అనుమతించాలి.
– అబ్బిరెడ్డి లక్ష్మి,
రాణిగారితోట, విజయవాడ


