కూచిపూడి హైస్కూల్‌కు అవార్డు
కూచిపూడి(మొవ్వ): స్థానిక శ్రీ సిద్ధేంద్ర జెడ్పీ ఓరియంటల్ హై స్కూల్‌కు ‘స్వచ్ఛ ఏవం హరిత విద్యాలయ రేటింగ్–2025’ అవార్డు లభించింది. ఈ విషయాన్ని ఎంఈఓ–1 అమ్ముల భాను ప్రకాష్ బుధవారం విలేకరులకు తెలిపారు. జిల్లాలోని 197 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో కూచిపూడి పాఠశాలకే ఈ ఘనత లభించడం ఆనందకరమని పేర్కొన్నారు. ఈ నెల 26వ తేదీన విజయవాడలో జరిగే గణతంత్ర దినోత్సవంలో పాఠశాల హెచ్‌ఎం అమిరెడ్డి అనుపల్లవి భువనేశ్వరి ఈ అవార్డు స్వీకరిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా స్వచ్ఛ ఏవం హరిత విద్యాలయ రేటింగ్ సాధించడంలో ముఖ్యపాత్ర పోషించిన పాఠశాల హెచ్‌ఎం అమిరెడ్డి అనుపల్లవి భువనేశ్వరి, ఆయా టి.నాగమణి, నైట్ వాచ్‌మన్ సత్య శ్రీనివాస్‌ను సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులతో పాటు సీఆర్పీలు తాత సమర్పణరావు, సీహెచ్ శ్రీమన్నారాయణ పాల్గొన్నారు.


