అన్నదాతల
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సంక్షోభంలో వ్యవసాయం
తీవ్ర
నష్టం మిగిల్చిన
తుపానులు..
● పండించిన ఏ ఒక్క పంటకూ
దక్కని గిట్టుబాటు ధర
● అందని ప్రభుత్వ సాయం
● అప్పుల ఊబిలోకి రైతులు
● మూతపడిన ఎత్తిపోతల పథకాలు,
జాడ లేని సాగర్ జలాలు
● నిండా ముంచిన తుపాన్లు
● ఆత్మహత్యలే శరణ్యం
అంటున్న రైతన్నలు
తుపాను కారణంగా కృష్ణా జిల్లా కంకిపాడు మండలం దావులూరు గ్రామంలో
పడిపోయిన వరి పనలను చూపుతున్న రైతు(ఫైల్)
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రకృతి వైపరీత్యాలు, చీడ పీడలు, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా వ్యవసాయం సంక్షోభంలో పడిపోయింది. పెట్టుబడులు పెరిగి.. పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించక రైతాంగం కన్నీరు పెడుతోంది. వడ్డీకి తెచ్చి వ్యవసాయం చేసిన రైతులు పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోయారు. అప్పులు తీర్చే మార్గం లేక ఆత్మహత్యలే శరణ్యమంటున్నారు. మెట్ట, డెల్టా ప్రాంతం అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల రైతులు ఆర్థికంగా నష్టపోయారు. ఆపన్న హస్తం అందించి ఆదుకోవాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. పథకాల పేరుతో అరకొర ఆర్థిక సహాయం అందించి వంచన చేస్తోంది. పంట ల గిట్టుబాటుపై మాయ మాటలు చెబుతోంది.
గత ప్రభుత్వం ఆర్బీకేలు ఏర్పాటు చేసి విత్తు నుంచి విత్తనం వరకు ఒకే చోట అందించింది. రైతు భరోసా పేరుతో ఆర్థిక సహాయం చేసింది. ప్రభుత్వమే ప్రీమియం చెల్లించింది. ఇన్‌పుట్ సబ్సిడీ కింద సాయం చేసింది. ఏ సంవత్సరం పంట నష్టపోతే ఆ సంవత్సరమే పరిహారం అందించి ఆదుకుంది. మిర్చి రూ. 22 వేలు, పత్తి రూ. 8వేలు, మొక్క జొన్న రూ. 2300కు ధరకు కొనుగోలు చేసింది. దీంతో రైతులు వ్యవసాయాన్ని పండుగలా చేశారు.
చంద్రబాబు ప్రభుత్వంలో ధరలు పాతాళానికి పడిపోయాయి. మిర్చి రూ. 9వేలకు పడిపోయింది. మొక్క జొన్న రూ. 1,700కు కూడా కొనుగోలు చేసే నాథుడే లేడు. సీసీఐ కొనుగోళ్లు సక్రమంగా జరగక అరకొరగా పండిన పత్తిని రూ. 5వేలకే విక్రయించాల్సిన పరిస్థితి. ధాన్యం కొనుగోళ్లలో కొర్రీలు పెట్టడం, అధికార పార్టీ నేతలే దళారులుగా మారి తక్కువ ధరకు అడుగుతున్నారు. వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో రైతులు తెగనమ్ముకుని నష్టపోతున్నారు. విత్తనాలు, ఎరువులు సక్రమంగా అందడం లేదు.
సాగు వివరాలు (హెక్టార్లలో):
ఎన్టీఆర్ జిల్లాలో..
పంట చేతికి వచ్చే సమయంలో సంభవించిన మొంథా తుపాను రైతుల ఆశలను ఊడ్చి పెట్టుకుపోయింది. పూర్తిగా పంట దెబ్బతిని రైతులు దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయారు. ప్రభుత్వం పంట నష్టం అంచనాలు తక్కువగా చూపి పరిహారంలో కోత విధించింది. అరకొరగా పరిహారం ఇచ్చి చేతులు దులుపుకొంది. రైతులు కోలుకోలేని విధంగా దెబ్బతిన్నారు. అంతకు ముందు సంవత్సరం వచ్చిన తుపాను రెండు జిల్లాల్లో భారీ నష్టం మిగిల్చింది. తుపాన్లకు తోడు అధిక వర్షాలు, తెగుళ్లు పంట దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపాయి. మిర్చి దిగుబడి 10 క్వింటాళ్లకు పడిపోగా పత్తి దిగుబడి ఎకరాకు కేవలం 5 క్వింటాళ్లు మాత్రమే వచ్చింది.
ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలో గత రెండేళ్లుగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మెట్ట ప్రాంతంలో పత్తి, మిర్చి, మొక్కజొన్న సాగు చేసిన రైతులు, డెల్టా ప్రాంతంలో వరి ఇలా రైతులు ఆరుగాలం పండించిన ఏ ఒక్క పంటకూ గిట్టుబాటు ధర లేదు. అదే సమయంలో సాగు ఖర్చులు ఏటేటా రెట్టింపవుతున్నాయి. బ్యాంకులు రుణాలు, సహకార సంఘాలు రుణాలు ఇవ్వకపోవడంతో వడ్డీ వ్యాపారుల నుంచి అప్పులు తెచ్చి పంటలు పండిస్తున్నారు. ధరలు స్థిరీకరించి ఆదుకోవాల్సిన ప్రభుత్వం తప్పుడు ప్రకటనలతో కాలం వెళ్లదీస్తోంది. అన్నదాత సుఖీభవ కింద అరకొర సాయం చేసిన ప్రభుత్వం, ఇన్‌పుట్ సబ్సిడీ, సున్నావడ్డీ, పంటల బీమా వంటి పథకాలు అమలు చేయకపోవడంతో రైతులపై మరింత ఆర్థిక భారం పడింది.
అన్నదాతల


