మూత్రాన్ని ఆపుకోవడం సరి కాదు..
మూత్రం వస్తున్న సిగ్నల్ వచ్చిన తర్వాత ఎక్కువ సేపు ఆపుకోవడం సరికాదు. అలా చేయడం ద్వారా మూత్రాశయ, కిడ్నీల సమస్యలు తలెత్తుతున్నాయి. మా వద్దకు వచ్చే వారిలో కిడ్నీలో రాళ్లు, ప్రొస్టేట్ సమస్యలు, యూరినరీ ట్యూబ్ సన్నబడటం, అర్జంట్‌గా యూరిన్ రావడం, అసలు రాకపోవడం వంటి వారు ఉంటున్నారు. కిడ్నీలో రాళ్లు, ప్రోస్టేట్ సమస్యలున్న వారికి అందరికీ సర్జరీ అవసరం లేదు. చాలా మందిలో మందులతో నయం చేయవచ్చు. యూరిన్ ట్యూబ్ సన్నబడటం వంటి సమస్య పుట్టుకతో పిల్లల్లో కూడా ఉంటుంది. అలాంటి వారికి మందులు, సర్జరీ ద్వారా సరిచేస్తున్నాం. 10 ఏళ్లలో 12,500 వరకూ యూరాలజీ సర్జరీలు చేశాం.
– డాక్టర్ గుంటక అజయ్‌కుమార్, యూరాలజిస్ట్


